Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Punjab Drug : పంజాబ్ రాష్ట్రంలో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, పంజాబ్ ఇంఛార్జ్ సచిన్ పైలట్ విమర్శించారు.
Punjab Drug : పంజాబ్‌ను డ్రగ్స్ ముప్పు తీవ్రంగా వేధిస్తోంది. విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ విక్రయాలు, సరఫరా, గన్ కల్చర్ వంటివి ఆ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, పంజాబ్ ఇంఛార్జ్ సచిన్ పైలట్ స్పందించారు. రాష్ట్రంలో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ అవుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీలే కారణమని సచిన్ విమర్శించారు.
పంజాబ్‌లో విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతిపై సచిన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘పంజాబ్ ప్రజలు ఒక విషయం గురించి చెప్పుకొంటున్నారు. ఇక్కడ పిజ్జా లేదా కోక్ ఆర్డర్ చేస్తే 40 నిమిషాల్లో లేదా గంటలో డెలివరీ అవుతోంది. అదే ‘చిట్టా (హెరాయిన్)’ మాత్రం అంతకంటే ముందుగా ఇంటికి డెలివరీ అవుతోంది. ఒక్క కాల్ చేసి చెబితే చాలు డ్రగ్స్ వచ్చేస్తాయి. పాకిస్తాన్ నుంచి నిరంతరాయంగా రసాయన మత్తు పదార్థాలు పంజాబ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని బీజేపీ చెబుతోంది.
అయితే, 12 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ పన్నెండేళ్లుగా బీజేపీ ఇదే మాట చెబుతోంది. మత్తు లేని రాష్ట్రంగా చేస్తామంటోంది. విచ్చలవిడిగా పంజాబ్‌లో సాగుతున్న డ్రగ్స్ వ్యాపారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత. డ్రగ్స్ రవాణాను అరికట్టడంతో కేంద్ర హోం శాఖ ఎందుకు విఫలమవుతోంది. గుజరాత్ పోర్టు నుంచి మాత్రమే రూ.21,000 డ్రగ్స్ సీజ్ చేశారంటే ఏ స్తాయిలో డ్రగ్స్ సరఫరా అవుతుందో అంచనా వేయొచ్చు’’ అని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- BJP
- Chitta
- Punjab Drug
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

