‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
గనుల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలక్ట్రికల్ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్), సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ అధికారులు సూచించారు. విద్యుత్ భద్రతపై...
– డీజీఎంఎస్ అధికారుల సూచన
– కొత్తగూడెం ఏరియాలో ఎలక్ట్రికల్ సేఫ్టీపై అవగాహన సదస్సు
రుద్రంపూర్, అక్టోబర్ 15 : గనుల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలక్ట్రికల్ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్), సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ అధికారులు సూచించారు. విద్యుత్ భద్రతపై నిరంతర శిక్షణ, పర్యవేక్షణ, నాణ్యమైన పరికరాల వినియోగం, ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్ఓపీలు) అమలుతో ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని పేర్కొన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్–2023 ప్రకారం విద్యుత్ భద్రతా చర్యలపై ఇంటరాక్టివ్ సెషన్, వర్క్‌షాప్ నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్), సౌత్ సెంట్రల్ జోన్ కే. మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏరియా రక్షణాధికారి ముక్కపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. తొలుత డీజీఎంఎస్ బృందానికి ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
విద్యుత్ పనుల్లో అప్రమత్తత అవసరం
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ భూగర్భ గనులు, ఉపరితల గనులు, వర్క్‌షాప్‌లలో విద్యుత్ పనులు నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలక్ట్రికల్ విభాగంలో సిబ్బంది కొరత లేకుండా అవసరమైన ఇంజినీర్లను నియమించుకోవాలని, అనుభవజ్ఞులైన సీనియర్ల నుంచి జూనియర్లకు నిరంతరం శిక్షణ అందించాలని పేర్కొన్నారు. కీలక పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచుకోవడంతోపాటు రక్షణ వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని తెలిపారు.
నిబంధనల అమలుతోనే ప్రమాదాల నివారణ
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ దేవ్ కిషన్ శర్మ మాట్లాడుతూ భద్రతా అవగాహన కార్యక్రమాల అనంతరం వాటి అమలు తీరును సమీక్షించాలని సూచించారు. ఉపరితల గనుల్లో సరిపడా సూపర్వైజర్లు ఉండేలా చూడాలని, ఎస్ఓపీలను తప్పనిసరిగా పాటించాలని, పరికరాల నాణ్యతను నిరంతరం పరీక్షించాలని తెలిపారు. అవగాహనతోపాటు క్షేత్రస్థాయిలో భద్రతా చర్యలను అమలు చేసినప్పుడే ప్రమాదాలను అరికట్టగలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ డైరెక్టర్ కే. మహేశ్వర్ రెడ్డి విద్యుత్ భద్రతపై అధికారులకు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు, ఎలక్ట్రీషియన్లకు అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం గనుల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, ప్రస్తుత భద్రతా పరిస్థితులపై అధికారులతో సమీక్షించి, ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ, ఎస్ఓ టు జీఎం ఎం. గోవిందరావు, ఏరియా ఇంజినీర్ వి. రామకృష్ణ, ఏరియా రక్షణాధికారి ఎం. వెంకటేశ్వరరావు, డీజీఎం (ఈఅండ్ఎం) జె. క్రిస్టఫర్, పద్మావతి గని ఏజెంట్ రామ్ భరోజ్ మహాతో, మేనేజర్లు రామచంద్ర మురళి, పాకా రవికిరణ్తోపాటు కొత్తగూడెం ఏరియాలోని భూగర్భ, ఉపరితల గనులు, వివిధ విభాగాల అధికారులు, రక్షణాధికారులు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు, ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

