Sundar C | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Sundar C | లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా భక్తిరస చిత్రం ‘మహాశక్తి’. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయం సాధించిన ‘అమ్మోరు తల్లి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందించారు.
Sundar C | లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా భక్తిరస చిత్రం ‘మహాశక్తి’. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయం సాధించిన ‘అమ్మోరు తల్లి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో నయనతార అమ్మవారి శక్తిమంతమైన రూపంలో కనిపించనుండగా, రెజీనా కసాండ్రా ప్రతినాయిక పాత్రలో, సీనియర్ నటి ఊర్వశి కీలక పాత్రలో నటించారు. నవంబర్ 6న ఐదు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న దర్శకుడు సుందర్ సి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌పై వస్తున్న విమర్శలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సినిమా నిర్మాణంలో రాబోయే మార్పులు, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై స్పందించారు.
‘మహాశక్తి’ ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచి అందులోని గ్రాఫిక్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వీటిపై సుందర్ సి స్పందిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. సినిమాలో మొత్తం మూడు వేలకు పైగా సీజీఐ షాట్లు ఉన్నాయని, వాటిలో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ సాంకేతికతను ఉపయోగించామని వెల్లడించారు. మిగిలిన విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం స్థానిక తమిళ సాంకేతిక నిపుణుల కష్టంతోనే రూపొందించామని చెప్పారు. సుమారు 800 మంది టెక్నీషియన్లు ఏడాదికి పైగా రేయింబవళ్లు శ్రమించి ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను సిద్ధం చేశారని వివరించారు. విదేశీ స్టూడియోలపై ఆధారపడకుండా స్థానిక ప్రతిభతో ఇంత భారీ స్థాయిలో విజువల్స్ రూపొందించామని, వారి కష్టాన్ని గుర్తించకుండా విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందని అన్నారు.
సినిమా రంగంలో ఏఐ తీసుకురాబోతున్న మార్పుల గురించి సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 మార్చిలో ‘మహాశక్తి’ పనులు ప్రారంభించామని, కథా చర్చలు, గ్రాఫిక్స్ సహా సినిమా పూర్తి చేయడానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టిందని తెలిపారు. అయితే ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో సినిమా నిర్మాణ విధానమే పూర్తిగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. సంప్రదాయ పద్ధతిలో షూటింగ్‌లు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం కంప్యూటర్ల ముందే కూర్చొని సినిమాలు రూపొందించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. నటీనటులు తమ రూపం, స్వరం ఉపయోగించడానికి అనుమతి ఇస్తే చాలని, మిగిలిన సెట్టింగులు, సన్నివేశాలను ఏఐ సాయంతోనే సృష్టించే స్థాయికి సాంకేతికత చేరుకుంటోందని వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
Sundar C | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

