Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతం తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా ఈ వారం ‘రివార్డ్ అండ్ రివేంజ్’ థీమ్‌తో నిర్వహిస్తున్న టాస్కులు హౌస్మేట్స్ మధ్య కొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతం తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా ఈ వారం ‘రివార్డ్ అండ్ రివేంజ్’ థీమ్‌తో నిర్వహిస్తున్న టాస్కులు హౌస్మేట్స్ మధ్య కొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి. పదో వారంలో జరగనున్న ఫ్యామిలీ వీక్‌లో తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాలంటే ఈ వారం ఆటల్లో సత్తా చాటాల్సి ఉండటంతో ప్రతి ఒక్కరూ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వారం నిర్వహించిన మొదటి ఛాలెంజ్‌లో ముకేష్ టీమ్ విజయం సాధించింది. ఆ టీమ్ తరఫున శ్వేతకు రివార్డ్ దక్కింది. అయితే, ఈ టాస్క్‌కు సంచాలకులుగా వ్యవహరించిన త్రిగుణ్, ముకేష్ మధ్య నిర్ణయాల విషయంలో విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ వేర్వేరు నిర్ణయాలు ప్రకటించడంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకుని హెచ్చరించాల్సి వచ్చింది.
ఇక రెండో ఛాలెంజ్‌లో బస్తాలు, థర్మకోల్‌తో కూడిన 8 ఆకారపు టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో కంటెస్టెంట్లు తమ బ్యాగులను కాపాడుకునేందుకు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే సుధీర్, ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ముకేష్, వర్షిణిలతో సుధీర్‌కు విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్ల సమయంలో ముకేష్ చేసిన వ్యాఖ్యలు, వర్షిణి ప్రవర్తనపై సుధీర్ అసంతృప్తిగా ఉన్నాడు. తాజాగా జరిగిన టాస్క్‌లో ముకేష్ బ్యాగ్‌లో వస్తువులు తగ్గిపోవడంతో అతడు ఓడిపోయే అవకాశం ఉందని సుధీర్ భావించాడు.
ఈ విషయాన్ని అమన్‌తో ప్రస్తావిస్తూ.. ముకేష్ బ్యాగ్‌లో తక్కువ వస్తువులు ఉన్నాయని, అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. ఈ మాటలు విన్న ముకేష్ ఆగ్రహంతో సుధీర్ బ్యాగ్‌ను లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో సుధీర్ సహనం కోల్పోయాడు. గతంలో చేసిన సహాయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు తనపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాడు. “ఊరికే హెల్ప్ చేయడం.. మళ్లీ వచ్చి నీవల్లే ఇక్కడ ఉన్నావని అనడం ఏంటి? నువ్వు ఇచ్చిన అధికారంతో నేను ఇక్కడ ఉండాలా?” అంటూ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. అంతేకాకుండా తన మైక్, బ్యాగ్‌ను కింద విసిరేసి నిరసన తెలిపాడు.
ఈ గొడవతో ఆగని సుధీర్.. నేరుగా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. తన ఆట నచ్చకపోతే హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాలని కోరాడు. తనకు ఎవరి సహాయం అవసరం లేదని స్పష్టం చేశాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అమన్తోనూ సుధీర్‌కు పెద్ద గొడవ జరిగింది. అమన్ కారణంగా టాస్క్ నుంచి డిస్క్వాలిఫై కావడంతో అతడిపై సుధీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇకపై సుధీర్ తన టార్గెట్‌లో ఉంటాడని అమన్ కూడా ఘాటుగా సమాధానమిచ్చాడు. ఈ గొడవల మధ్య జరిగిన టాస్క్‌లో వంశీ విజయం సాధించాడు.
ఇక ఈ వారం కెప్టెన్ త్రిగుణ్‌తో పాటు ఆర్కే, శ్వేత మినహా మిగిలిన హౌస్మేట్స్ నామినేషన్లలోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ముకేష్ గ్రూప్‌తో సుధీర్‌కు విభేదాలు పెరగడంతో అతడి ఆటపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు వర్షిణి కూడా డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ వారం ప్రేక్షకుల ఓట్లతో ఎవరు సురక్షితంగా బయటపడతారు? ఎవరు హౌస్‌ను వీడతారనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
Telangana Urban Projects | తెలంగాణలో ఐదు పట్టణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. రూ.873 కోట్లు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

