ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. రియల్ మీద జీటీ నియో 2 టీ, రియల్ మీ క్యూ3ఎస్ స్మార్ట్ ఫోన్లను చైనాలో విడుదల చేశారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు హైఎండ్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లే. రియల్ మీ జీటీ నియో 2టీ స్మార్ట్ ఫోన్.. మీడియాటెక్ డైమెన్షిటీ 1200 ఎస్వోసీ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. అదే రియల్ మీ క్యూ3ఎస్ ఫోన్ మాత్రం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ఎస్వోసీ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
రియల్ మీ జీటీ నియో 2 టీ ఫోన్ 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ.22,200 కాగా.. 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.24,500 గా ఉంది. 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.28,100 గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్స్ వేరియంట్లలో లభిస్తుంది.
రియల్ మీ క్యూ3ఎస్ ఫోన్ 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.17,500 గా ఉంది. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,700 కాగా.. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫోన్ ధర రూ.23,400 గా ఉంది. ఈ ఫోన్ కూడా బ్లూ, వైట్ కలర్స్ లో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ 2.0, 6.43 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెచ్ జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్షిటీ 1200 ఎస్వోసీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 64 ఎంపీ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 4 సీఎం మాక్రో లెన్స్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వైఫై6, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ 2.0, 6.6 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ , 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ట్రిపుల్ రేర్ కెమెరా, 4 సీఎం మాక్రో సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లతో రియల్ మీ క్యూ3ఎస్ ఫోన్ విడుదలైంది. త్వరలోనే ఈ ఫోన్లు భారత మార్కెట్ లో కూడా విడుదల కానున్నాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Data Stealing : ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!
మీరు లొడలొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోసమే ఈ యాప్స్
Six Pack : సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Free wifi : ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..