ఎదులాపురం, సెప్టెంబర్ 27 : ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 17 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఆదిలాబాద్ సీసీఐని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీసీఐని పునఃప్రారంభిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే సీసీఐని పునఃప్రారంభించకపోతే ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు.