బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Mar 07, 2020 , 16:40:56

రూ.12,999కే రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌

రూ.12,999కే రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 6ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.12,999 ఉండగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.14,999గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.15,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 11వ తేదీ నుంచి విక్రయించనున్నారు. 

రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.5 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జి90టి ప్రాసెసర్‌, 4/6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10, 64, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. 


logo