Parenting Tips | బాల్యాన్ని చిదిమేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఈ టెక్‌యుగంలో మీ పిల్లలను మీరే భద్రంగా కాపాడుకోవాలి!
Parenting Tips | చూడకూడని దృశ్యాలు కనిపిస్తున్నాయి. వినకూడని మాటలు వినిపిస్తున్నాయి. వయసుకు మించిన ఆలోచనలు చెడు వైపుగా ప్రేరేపిస్తున్నాయి. పసి మనసుల్లో విషబీజాలు నాటుతున్నాయి. ఇది బాల్యానికి ఎర వేసే కుట్ర. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్.. నుంచి పసికూనల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలదే.
Parenting Tips | చూడకూడని దృశ్యాలు కనిపిస్తున్నాయి. వినకూడని మాటలు వినిపిస్తున్నాయి. వయసుకు మించిన ఆలోచనలు చెడు వైపుగా ప్రేరేపిస్తున్నాయి. పసి మనసుల్లో విషబీజాలు నాటుతున్నాయి. ఇది బాల్యానికి ఎర వేసే కుట్ర. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్.. నుంచి పసికూనల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలదే.
సెల్‌ఫోన్.. పిల్లల చేతి ఆటబొమ్మగా మారింది. ఫోర్ జీ, ఫైవ్ జీ.. ఇంటర్నెట్ వేగం పెరుగుతున్న కొద్దీ విలువలు రాజీబాట పడుతున్నాయి. ఎప్పుడో కౌమారం తర్వాత తెలియాల్సిన విషయాలన్నీ ఐదారేళ్ల బాల్యంలోనే అర్థమైపోతున్నాయి. నిజానికి ఇదంతా ఓ కుట్ర. సైబర్ నేరగాళ్లు బాల్యంపై విసురుతున్న వల.. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్. పద్దెనిమిదేళ్లలోపు బాలబాలికలను లక్ష్యం చేసుకుని ఫొటోలు, వీడియోలు, ఆడియోలు.. తదితర అసభ్యకర కంటెంట్ సృష్టించడం, ప్రసారం చేయడం, పంపిణీ చేయడం శిక్షార్హమైన నేరం. దీన్నొక వ్యాపారంగా మార్చుకుని కాసుల కోసం కక్కుర్తిపడే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరికొందరికి ఇదో పైశాచికానందం. దీన్నో కాలక్షేపంగా భావించేవారూ ఉన్నారు. ఎలా చేసినా.. నేరం నేరమే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. 2021లో దాదాపు లక్షా యాభైవేల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది పదహారు శాతానికిపైగా అధికం.
ఎన్నో రూపాలు..
లైంగిక దోపిడి, హింస ఎన్నో రూపాలుగా కొనసాగుతున్నది. బాలబాలికలు లక్ష్యంగా అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వదలడం ఆ కుట్రలో భాగమే. చైల్డ్ సెక్స్ టూరిజం.. పేరుతో ఈ మధ్య వికృత యాత్ర ఊపందుకుంటున్నది. అంతర్జాతీయ టూరిస్టులనూ ఆకర్షిస్తున్నది. అభంశుభం తెలియని పసితనాన్ని పడుపు వృత్తిలోకి లాగడం.. ఎంత దుర్మార్గం! ఆమాటకొస్తే, పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలకు బలవంతంగా తండ్రి వయసు పెద్ద మనిషికి కట్టబెట్టే బాల్య వివాహలు కూడా ఒకరకంగా లైంగిక దోపిడి కిందికే వస్తాయి. భయపెట్టో, మభ్యపెట్టో, దాడికి తెగబడో.. పిల్లల్ని లైంగిక చర్యలకు ఉసిగొల్పడం అత్యంత దారుణం.
కట్టుదిట్టమైన చట్టాలు
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోస్కో) ప్రకారం.. ఏ రూపంలో ఉన్నా సరే బాల్యంతో ముడిపడిన అసభ్యమైన కంటెంట్‌ను సృష్టించడం శిక్షార్హమైన నేరమే. ఇలాంటి వీడియోలు, ఆడియోలను గుర్తించి, తొలగించాల్సిన పని, అవసరమైతే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రధాన బాధ్యత.. సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ సేవలు అందించే సంస్థలదేనని 2021లో అమలులోకి వచ్చిన భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) స్పష్టం చేసింది. ఆన్లైన్ అశ్లీలతకు సంబంధించి బాలబాలికల్లో అవగాహన పెంచేందుకు, చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు… దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేస్తున్నాయి. లైంగిక దాడి బాధితులకు సాంత్వన చేకూర్చేందుకు, పునరావాసం కల్పించేందుకు తమవంతు ప్రయత్నమూ చేస్తున్నాయి. ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి.
సాధికార సంస్థలు
ఆన్లైన్ అశ్లీలత బారినుంచి బాల్యాన్ని కాపాడే బాధ్యతను వివిధ సంస్థలకు అప్పగించింది భారత ప్రభుత్వం. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) అందులో ఒకటి. దీన్ని ఓ ప్రత్యేక చట్టం కింద సృష్టించారు. పిల్లల హక్కులను రక్షించడం, ఆ హక్కుల పట్ల అవగాహన పెంచడం ఈ సంస్థ బాధ్యత. అవసరమైతే చట్టాల పదును పెంచేందుకు తనవంతు సలహాలు అందిస్తుంది. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నది. వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను సమన్వయం చేస్తున్నది. ఈ ప్రయత్నంలో ఎన్జీవోల పాత్రనూ మరువలేం. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా.. తక్షణం రంగంలోకి దిగుతున్నాయి. లోపాలను ఎత్తిచూపుతున్నాయి. పాపాలను ఎండగడుతున్నాయి. అవును. సామాజిక మాధ్యమాల ముసుగులో అశ్లీల, అసభ్య, అనైతిక .. వ్యాపారాలు సాగిస్తున్న ముఠాల ఆటకట్టించాలి. బాల్యానికి భద్రమైన భవితను అందించాలి.
ముఖ్యమైన హెల్ప్ లైన్స్
☞ Nation Cyber Crime Reporting Helpline – 1930 : https://cybercrime.gov.in
☞ NCPR Complaint Portal – http://www.ebaalnidan.nic.in/
☞ Child Line 1098 – https://www.childlineindia.org/
☞ National Commission for Women Helpline – 7827170170 and http://www.ncw.nic.in/helplines
☞ Mahila Bol Helpline – 0124-4007444 and http://mahilabol.org/women-helpline/
☞ Prajwala Foundation – https://www.prajwalaindia.com/
సామాజిక మాధ్యమాల్లో అశ్లీలతపై
☞ Facebook – https://www.facebook.com/help/1380418588640631/?helpref=hc_fna
☞ Instagram – https://help.instagram.com/165828726894770
☞ Google – https://transparencyreport.google.com/child-sexual-abuse-material/reporting
☞ Twitter – https://help.twitter.com/en/forms/safety-and-sensitive-content/cse
☞ YouTube – https://support.google.com/youtube/answer/2802027#report_channel
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Tech Tips | ఫేస్బుక్లో స్పామర్ల బారిన పడి మోసపోవద్దంటే ఈ టిప్స్‌ను కచ్చితంగా పాటించండి
Tech Tips | మీ ఫోన్ పోయిందా? సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్!
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

