Oppo F23 5G | 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్23 5జీ లాంఛ్ : ధర ఎంతంటే..!
రెడ్మి నోట్ 12 ప్రొకు దీటుగా ఒప్పో ఎఫ్23 5జీ (Oppo F23 5G) ని దేశీ మార్కెట్లో ఒప్పో లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో కెమెరా పెర్ఫామెన్స్‌పై ఫోకస్ పెడుతూ ఒప్పో ఎఫ్ సిరీస్ ఫోన్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తుండగా లేటెస్ట్ లాంఛ్లోనూ కెమెరా ఫీచర్లను కంపెనీ ఆకర్షణీయంగా మలిచింది.
న్యూఢిల్లీ : రెడ్మి నోట్ 12 ప్రొకు దీటుగా ఒప్పో ఎఫ్23 5జీ (Oppo F23 5G) ని దేశీ మార్కెట్లో ఒప్పో లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో కెమెరా పెర్ఫామెన్స్‌పై ఫోకస్ పెడుతూ ఒప్పో ఎఫ్ సిరీస్ ఫోన్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తుండగా లేటెస్ట్ లాంఛ్లోనూ కెమెరా ఫీచర్లను కంపెనీ ఆకర్షణీయంగా మలిచింది.
న్యూ ఒప్పో ఎఫ్23 కొద్ది మార్పులతో ప్రీమియం రెనో 8 సిరీస్ తరహాలో కనిపిస్తుంది. బోల్డ్ గోల్డ్, కూల్ బ్లాక్ కలర్స్‌లో మే 18 నుంచి ఒప్పో ఎఫ్23 5జీ అందుబాటులో ఉండనుండగా 8జీబీ ర్యాం, 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 24,999కి ఒప్పో ఇండియా స్టోర్, అమెజాన్, మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీని రూ. 28,999గా కంపెనీ నిర్ణయించింది. ఒప్పో ఎఫ్23 5జీ డిజైన్ మీడియం రేంజ్ బడ్జెట్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. స్లిమ్ బాడీ, ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్, 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో ఒప్పో ప్రీమియం ఫోన్ కస్టమర్ల ముందుకొచ్చింది.
ఒప్పో ఎఫ్23 5జీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ చిప్సెట్, 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఇక కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే ఏఐ ఆధారిత 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు వెనుక భాగంలో రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఇక ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. యూజర్లు హై క్వాలిటీ ఫొటోల కోసం పోర్ట్రయిట్ మోడ్, ఏఐ పోర్ట్రయిట్ రీటచింగ్, సెల్పీ హెచ్డీఆర్, ఏఐ కలర్ పోర్ట్రయిట్ వంటి ప్రముఖ ఫీచర్లను వాడుకోవచ్చు.
Read More
OnePlus Nord 3 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్3 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

