OnePlus Nord 3 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్3 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..
OnePlus Nord 3 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. భారత్ మార్కెట్లోకి నార్డ్3 5జీ అనే స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది.
OnePlus Nord 3 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ రానున్నది. 2021 జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వెబ్ సైట్ సంకేతాలిచ్చింది. వన్ ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ ఈ నెల రెండో వారం నుంచి వచ్చే నెల రెండో వారంలో ఆవిష్కరిస్తుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. త్వరలోనే భారత్ మార్కెట్లో ఆవిష్కరణ తేదీ ప్రకటిస్తామని వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ పేర్కొంది. వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ తోపాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ కూడా రిలీజ్ చేస్తారు.
6.7 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది.
వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుందని భావిస్తున్నది. దీని ధర రూ.30,000-40,000 మధ్య పలుకుతుందని అంచనా. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

