ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్.. గత జులైలో నోర్డ్ 2 5జీ ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ ఫోన్లో ఉండే లేటెస్ట్ ఫీచర్లు స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకున్నాయి. దీంతో చాలామంది ఈ ఫోన్లను కొనడానికి ఆసక్తి చూపించారు. అయితే.. ఫోన్‌ను తీసుకున్న కొన్ని రోజులకే.. ఢిల్లీకి చెందిన లాయర్ గౌరవ్ గులాటి జేబులో ఉండగానే ఫోన్ పేలిపోయింది. దీంతో తనకు కొన్ని కాలిన గాయాలు అయ్యాయి. ఆ తర్వాత బెంగళూరులోనూ ఓ మహిళ బ్యాగ్‌లో ఉండగా ఫోన్ పేలిపోయింది. ఇలా.. దేశవ్యాప్తంగా వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్ పేలిన ఘటనలు కొన్ని జరిగాయి.
అయితే.. తన జేబులో ఉండగానే ఫోన్ పేలడం ఏంటి.. దానికి చార్జింగ్ పెట్టలేదు.. ఫోన్‌ను వాడటం లేదు.. దీనిపై వన్‌ప్లస్‌పై లీగల్ యాక్షన్ తీసుకుంటానని గులాటి వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. వన్‌ప్లస్ కంపెనీ మీద లీగల్‌గా ఫిర్యాదు కూడా చేశాడు.
కట్ చేస్తే.. గౌరవ్ గులాటికి వన్‌ప్లస్ కంపెనీ రివర్స్‌లో లీగల్ నోటీసు పంపించింది. అతడికి సీజ్ అండ్ డెసిస్ట్ నోటీసును పంపించింది. వన్‌ప్లస్ కంపెనీ గురించి సోషల్ మీడియాలో, ఇతర మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడని.. కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేసిన చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని.. కంపెనీ గురించి నెగెటివ్‌గా పెట్టిన పోస్టులు, చేసిన ట్వీట్లను వెంటనే డిలీట్ చేయాలంటూ నోటీసులో కంపెనీ పేర్కొన్నది.
దీనిపై స్పందించిన గౌరవ్.. కంపెనీ చేసిన తప్పిదాన్ని బయటపెట్టినందుకు నాకు నోటీసులు పంపిస్తారా? అంటూ కంపెనీ పంపించిన నోటీసులను ట్వీట్ చేశాడు. అలాగే.. కంపెనీకి పేలిపోయిన ఫోన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అప్పగించనని.. వాళ్లకు అప్పగిస్తే.. ఆ సాక్ష్యాన్ని నాశనం చేస్తారని ఆయన తెలిపాడు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని.. అక్కడే తేల్చుకుంటా అని గౌరవ్ స్పష్టం చేశాడు.
అయితే.. తన ఫోన్ పేలిపోయిందని తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు.. వెంటనే గౌరవ్‌ను సంప్రదించారు. కానీ.. కంపెనీ నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఆయన సంతృప్తి చెందక.. లీగల్‌గా ముందుకెళ్తున్నాడు.
सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं….
— GAURAV GULATI (@Adv_Gulati1) September 18, 2021
@barcouncilindia @OnePlus_IN @OnePlus_Support
So I have recieved this legal notice for raising my voice for whatever i have gone through after my mobile blast incident. So this is the price i have to pay for being the whistleblower. pic.twitter.com/6hOxTMi6Vw
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
iOS 15 : యాపిల్ ఐవోఎస్ 15 కొత్త అప్డేట్ సరికొత్త ఫీచర్లు ఏంటి? ఏ మోడల్స్‌లో డౌన్లోడ్ అవుతుంది?
Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్