Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్ | సామ్సంగ్ ఫోన్లకు మన దేశంలో చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో
సామ్సంగ్ ఫోన్లకు మన దేశంలో చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో సామ్సంగ్ ఇండియా మార్కెట్లో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. గత సంవత్సరం సామ్సంగ్ గెలాక్సీ 51 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి అప్‌గ్రేడ్ వర్షన్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్‌ను ఇండియాలో సెప్టెంబర్ 28న సామ్సంగ్ లాంచ్ చేయనుంది.

ముందు ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 19న రిలీజ్ చేయాలని భావించినా.. ఆరోజు రిలీజ్ చేయలేదు. సెప్టెంబర్ 28న సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నామని సామ్సంగ్ ట్విట్టర్లో తాజాగా ప్రకటించింది.
అయితే.. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల గురించి ఎక్కువగా సామ్సంగ్ రివీల్ చేయకున్నప్పటికీ.. సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్ ఫీచర్లు మాత్రం ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ ధర సుమారుగా రూ.32,900 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, హోల్ పంచ్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఈ ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. 7.4 ఎంఎం స్లిమ్ బిల్డ్ థిక్నెస్ మాత్రమే ఉంటుంది.
ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ, ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టా కోర్ క్వాల్కామ్ ఎస్ఎమ్7325 స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64 ఎంపీ రేర్ కెమెరా సెన్సార్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5జీతో పాటు 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
iOS 15 : యాపిల్ ఐవోఎస్ 15 కొత్త అప్డేట్ సరికొత్త ఫీచర్లు ఏంటి? ఏ మోడల్స్‌లో డౌన్లోడ్ అవుతుంది?
Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

