iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ | ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఐఫోన్ 13 గురించే. యాపిల్ ఫోన్ లవర్స్ అయితే.. ఐఫోన్ 13 లో ఉన్న ఫీచర్లకు ఫిదా అయిపోతున్నారు.

ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఐఫోన్ 13 గురించే. యాపిల్ ఫోన్ లవర్స్ అయితే.. ఐఫోన్ 13 లో ఉన్న ఫీచర్లకు ఫిదా అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఐఫోన్ 13ను కొనాలా.. అని తెగ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇండియాలో ఐఫోన్ 13 ధరలకు రెక్కలు వచ్చాయి. 128 జీబీ మోడల్ ఐఫోన్ 13 ధరే 80 వేల వరకు ఉంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అయితే.. రూ.1,29,900 గా ఉంది. దానికి కారణం..ఇక్కడి ట్యాక్స్‌లు అధికంగా ఉండటమే.

ఇండియాతో పోల్చితే కొన్ని దేశాల్లో ఐఫోన్ ధర చాలా తక్కువ. అక్కడ ఐఫోన్ 13 చాలా చీప్‌గా దొరుకుతుంది. ఆ దేశాలు ఏంటో తెలుసా? యూఎస్, హాంగ్‌కాంగ్, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, మలేషియా. ఈ దేశాల్లో ఐఫోన్ 13ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

యూఎస్‌లో ఐఫోన్ 13 ధర చాలా తక్కువగా ఉంటుంది. దానికి కారణం అక్కడ ట్యాక్స్ తక్కువగా ఉండటం. అందుకే.. ఐఫోన్ 13 సిరీస్ 128 జీబీ మోడల్ ఫోన్ మీద యూఎస్‌లో రూ.38 వేల వరకు సేవ్ చేయొచ్చు. అక్కడ ట్యాక్స్ 9.25 శాతం ఉన్నా కూడా.. ఒక్క డాలర్‌కు 76 రూపాయలు వేసుకున్నా.. ఐఫోన్ 13 లో 128 జీబీ మోడల్ ధర యూఎస్‌లో 799 డాలర్లు. అంటే.. మన కరెన్సీలో 66341 రూపాయలు. కానీ.. ఇండియాలో అదే ఐఫోన్ 13 ధర రూ.79,900. అంటే.. కనీసం 13,559 రూపాయల వరకు ఆ ఫోన్ మీద సేవ్ చేసుకోవచ్చు. అలాగే.. ఐఫోన్ 13 మినీ ధర 128 జీబీ మోడల్‌కు 699 డాలర్లు.. అంటే మన కరెన్సీలో 58038 రూపాయలు. కనీసం 11,862 రూపాయలు సేవ్ చేయొచ్చు. అలా.. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్ మీద 38 వేల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు.

అదే హాంకాంగ్‌లో అయితే.. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 128 జీబీ సిరీస్ ఫోన్ మీద 35 వేల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. సింగపూర్‌లో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 128 జీబీ మోడల్ ఫోన్ మీద 29 వేల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియాలో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మీద రూ.28 వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. యూఏఈలో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మీద రూ.31 వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. మలేషియాలో అయితే.. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్ మీద 29 వేల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు.

ఒక్క ప్రో మ్యాక్స్ మోడల్ మాత్రమే కాదు.. ఐఫోన్ 13లోని అన్ని మోడల్స్ కూడా ఈ దేశాల్లో తక్కువ ధరకే లభిస్తాయి. ఆ దేశాల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్లు ఉంటే.. వాళ్లు వచ్చేటప్పుడు ఫోన్ కొనుక్కొని రమ్మని చెప్పండి. దీంతో మీరు చాలావరకు ఐఫోన్ 13ను తక్కువ ధరకే సొంతం చేసుకున్నవాళ్లు అవుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Apple iPhone 13 | ఐఫోన్ 13 ప్రిబుకింగ్స్ ఇవాళ్టి నుంచే.. ఎక్కడ చేసుకోవాలి?
iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
iPhone 13 | లాంచ్‌లో దమ్ మారో దమ్ సాంగ్‌తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

