iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర | ఇండియా సహా.. 30 దేశాల్లో ఐఫోన్ 13 ప్రీఆర్డర్, సేల్స్ ఒకేసారి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్ల ప్రీఆర్డర్స్ యాపిల్

ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న ఐఫోన్ 13 లాంచ్ అయింది. త్వరలోనే సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇండియా సహా.. 30 దేశాల్లో ఐఫోన్ 13 ప్రీఆర్డర్, సేల్స్ ఒకేసారి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్ల ప్రీఆర్డర్స్ యాపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో సెప్టెంబర్ 17, 2021న సాయంత్రం 5.30 నుంచి ప్రారంభం కానున్నాయి.

మొదటి సారి ఇతర దేశాలలో పాటు ఇండియాలో కూడా ఒకేసారి ప్రీఆర్డర్స్, సేల్స్‌ను యాపిల్ సంస్థ ఐఫోన్ 13తో ప్రారంభించింది. సెప్టెంబర్ 24 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
అయితే.. ఐఫోన్ 13 సిరీస్‌లో అత్యంత ఖరీదైన ఫోన్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్. అందులోనూ 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఫోన్ ధర రూ.1,79,900. 13 ప్రో మ్యాక్స్‌లో కూడా 128 జీబీ, 256 జీబీ, 512 జీబీతో పాటు 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్లను సేల్‌లో ఉంచనున్నారు. 128 జీబీ దర రూ.1,29,900 కాగా, 256 జీబీ వేరియంట్ ధర రూ.1,39,900, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,59,900గా నిర్ణయించారు.

ఇక.. ఐఫోన్ మినీలో 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.69,900 కాగా.. 256 జీబీ వేరియంట్ ధర రూ.79,900, 512 జీబీ వేరియంట్ ధర రూ.99,900. ఐఫోన్ 13 లో 128 జీబీ వేరియంట్ ధర రూ.79,900, 256 జీబీ వేరియంట్ ధర రూ.89,900, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,09,900. ఐఫోన్ 13 ప్రోలో 128 జీబీ వేరియంట్ ధర రూ.1,19,900, 256 జీబీ వేరియంట్ ధర రూ.1,29,900, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,49,900, 1 టీబీ వేరియంట్ ధర రూ.1,69,900.

ఇవి కూడా చదవండి..
Redmi Smart TV: అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ స్మార్ట్ టీవీ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
iOS 15 Release Date | ఐఫోన్ 13 వచ్చేసింది.. భారత్‌లో ధరలు ఇలా..
iPhone 13 | లాంచ్‌లో దమ్ మారో దమ్ సాంగ్‌తో ట్విస్ట్ ఇచ్చిన ఆపిల్.. వీడియో
ఐఫోన్ యూజర్లూ.. బైక్‌పై వెళ్తున్నారా? మీ కెమెరా పాడవ్వచ్చు జాగ్రత్త!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

