న్యూఢిల్లీ : బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికపై వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్‌ను వన్‌ప్లస్ ప్రదర్శించింది. వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ పేరుకు తగ్గట్టే కొనుగోలు కోసం కమర్షియల్‌గా అందుబాటులో ఉండదు. అయితే భవిష్యత్‌లో రాబోయే వన్‌ప్లస్ ఫోన్లలో ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పీసీ తరహా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వాడటంతో మెరుగైన పెర్ఫామెన్స్ అందిస్తుంది.
పరిశ్రమలోనే తొలిసారి వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ యాక్టివ్ క్రియో ఫ్లక్స్ కూలింగ్ టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశపెట్టింది. దీంతో పీసీ తరహా లిక్విడ్ కూలింగ్‌ను అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనికోసం వన్‌ప్లస్ కెమెరా ప్రాంతం చుట్టూ రెండు మైక్రోపంపులను ఫిట్ చేసింది. దీంతో చిప్సెట్ నుంచి జనరేట్ అయ్యే వేడిని ఇవి సంగ్రహిస్తాయి.
బ్లూ కలర్లో కనిపించే పైప్‌లైన్స్ ద్వారా ఫ్లో అయ్యే ఐసీ కోల్డ్ లిక్విడ్ ఈ హీట్‌ను నిలువరిస్తుంది. కూలింగ్ టెక్నాలజీతో ఫోన్ టెంపరేచర్ 1.6 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గుతుంది. ఈ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ టైమ్ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇక వన్‌ప్లస్ 11 కాన్సెప్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్తో ఆక్సిజన్ఓఎస్ 13పై రన్ అవుతుంది.
Read More :
Naya Mall | ఈ డివైజ్‌ను కారులో పెట్టుకుంటే చెడు వాసనలు తొలగించి తాజా గాలి ఇస్తుంది