OnePlus 10 Pro : పలు లీకులు, ఊహాగానాల అనంతరం వన్‌ప్లస్ 10 ప్రొ లాంఛ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. వన్‌ప్లస్ 10 ప్రొ జనవరిలో రానుందని కంపెనీ సీఈఓ పీట్ లౌ తెలిపారు. జనవరిలో ఏ రోజున విడుదలవుతందనే వివరాలను వన్‌ప్లస్ త్వరలో వెల్లడించనుంది. వన్‌ప్లస్ 10 ప్రొ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో రానుంది. హైఎండ్ హార్డ్‌వేర్‌తో ముందుకొచ్చే వన్‌ప్లస్ ప్రొ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో 6.7 ఇంచ్ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేను కలిగిఉంటుంది.
వన్‌ప్లస్ 10 ప్రొ డిజైన్‌లో మార్పులు ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుండగా మిగిలిన ప్యానెల్ వన్‌ప్లస్ లోగోతో ఉంటుంది. ముందుభాగంలో సెల్ఫీలకోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12పై నడిచే వన్‌ప్లస్ 10 ప్రొ రూ 74,999కు లభిస్తుందని భావిస్తున్నారు.