బెంగళూర్ : ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Infosys founder) మూన్‌లైటింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులను హెచ్చరించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆసియా ఎకనమిక్ డైలాగ్ వేదికగా నారాయణ మూర్తి మూన్‌లైటింగ్ ట్రెండ్‌పై భగ్గుమన్నారు. వర్క్ ఫ్రం హోం నుంచి కార్యాలయం నుంచి పనిచేసే పద్ధతికి మారాలని యువ ఉద్యోగులను ఆయన కోరారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
యువ ఉద్యోగులు దయచేసి మూన్‌లైటింగ్ వలలో పడరాదని, నేను ఇంటి నుంచి పనిచేస్తా..వారానికి మూడు రోజులు కార్యాలయానికి వస్తా అనే ధోరణి నుంచి బయటపడాలని కోరారు. ఇన్ఫోసిస్ మొదటి నుంచి ఉద్యోగుల మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తోంది. ఓ కంపెనీలో పూర్తికాల ఉద్యోగి తన విధులు ముగిసిన తర్వాత ఇతర సంస్ధలకు సేవలందించడాన్ని మూన్‌లైటింగ్‌గా వ్యవహరిస్తారు.
కాగా మూన్‌లైటింగ్ ఆరోపణలపై కొద్దినెలల కిందట ఇన్ఫోసిస్ పలువురు ఉద్యోగులను తొలగించింది. ఫ్రీలాన్సింగ్ వర్క్‌ను చేయాలనుకునేవారు కంపెనీ అనుమతి తీసుకోవాలని కూడా ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఫ్రీలాన్స్ వర్క్ చేయదలుచుకున్న వారు ముందస్తుగా వారి మేనేజర్, హెచ్ఆర్ నుంచి అనుమతి పొందాలని, ఖాళీ సమయంలో ఇన్ఫోసిస్ లేదా ఇన్ఫోసిస్ క్లైంట్ల వ్యాపారంతో పోటీపడే సంస్ధలతో కాకుండా ఇతర సంస్ధల్లో సేవలు అందించవచ్చని పేర్కొంది. మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో గత కొంతకాలంగా హాట్ డిబేట్ సాగుతుండగా ఈ కల్చర్‌ను పలు టెక్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Read More :