WhatsApp Scam : రోజురోజుకూ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు యూజర్లను ట్రాప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి స్కామ్‌లను ఎన్నో చూశాం. ఈమెయిల్స్ పంపించడం.. ఫోన్లు చేయడం.. బ్యాంకు వివరాలు అడగడం.. మెసేజ్‌లు పంపించడం లాంటి స్కామ్‌లను చూశాం.
తాజాగా.. సైబర్ నేరగాళ్లు వాట్సప్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఫిషింగ్ లింక్స్‌తో యూజర్ల అకౌంట్లను కొల్లగొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మెసేజింగ్ కోసం వాట్సప్‌ను వినియోగిస్తున్నారు. అందుకే వాళ్లు వాట్సప్ ద్వారా యూజర్లను ట్రాప్ చేస్తున్నారు.
ప్రస్తుతం Rediroff.com పేరుతో యూజర్లకు వల వేస్తున్నారు. అది ఫిషింగ్ లింక్. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ రివార్డ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్‌ను నడిపిస్తున్నారు.
వాట్సప్‌లో పై లింక్ పేరుతో యూజర్లకు రివార్డులు ఇస్తామంటూ లింక్స్ ఫార్వార్డ్ చేస్తారు. యూజర్లు ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఒక డమ్మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెంటనే ఈ సర్వేను పూర్తి చేస్తే.. రివార్డు వస్తుందని అందులో ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు యూజర్లు సమాధానాలు చెప్పాలని అంటారు. తొందరపడి దాని మీద క్లిక్ చేయగానే.. యూజర్ వ్యక్తిగత వివరాలు అన్నీ అడుగుతారు. పేరు, వయసు, అడ్రస్, బ్యాంక్ కార్డుల వివరాలు ఎంటర్ చేయాలంటారు.
స్కామ్ గురించి తెలియక.. కొందరు యూజర్లు వాళ్ల వివరాలు అన్నీ ఇస్తారు. సబ్మిట్ బటన్ కొట్టగానే ఆ వివరాలన్నీ సైబర్ క్రిమినల్స్ సర్వర్‌లో స్టోర్ అవుతాయి. ఆ వివరాలతో వాళ్లు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను కాజేయడం లేదా ఆ వివరాలతో యూజర్లకు వల వేయడం లాంటివి చేస్తారు. అంతే కాదు.. ఆ లింక్ క్లిక్ చేయగానే.. స్మార్ట్‌ఫోన్, పీసీలలో సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యేలా చేస్తారు. ఆ మాల్వేర్ ప్రతి క్షణం.. యూజర్ కదలికలను గమనిస్తూ.. స్మార్ట్‌ఫోన్, పీసీలో ఉన్న విలువైన సమాచారాన్ని స్కామర్స్‌కు చేరవేస్తుంది.
అందుకే.. వాట్సప్ యూజర్లు Rediroff.ru, Rediroff.com లాంటి పేర్లతో లింక్స్ వస్తే వెంటనే వాటిని రిపోర్ట్ చేయాలి. వాటిపై అస్సలు క్లిక్ చేయకూడదు. ఓపెన్ చేయకూడదు. ఒకవేళ.. అటువంటి లింక్స్‌పై క్లిక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే యాంటీ వైరస్ ఇన్స్టాల్ చేసుకొని ఏదైనా వైరస్ సిస్టమ్‌లోకి చొచ్చుకొచ్చిందా లేదా అని వెంటనే చెక్ చేసుకోవాలి. లేకపోతే మీ అకౌంట్లలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అవసరం లేని ఈమెయిల్స్‌ను ఆటోమెటిక్‌గా డిలీట్ చేయడం ఎలా?
ఆపిల్‌కు షాక్.. టెక్ దిగ్గజం అనైతిక ప్రాక్టీస్‌పై సీసీఐ అభ్యంతరం