Gmail Tips | అవసరం లేని ఈమెయిల్స్‌ను ఆటోమెటిక్‌గా డిలీట్ చేయడం ఎలా?
Gmail Tips |నిజానికి.. జీమెయిల్లో ఉచితంగా 15జీబీ స్పేస్ మాత్రమే ఉంటుంది. అది నిండిపోతే.. ఎక్స్ట్రా జీబీ కావాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
Gmail Tips | కొందరికి రోజూ వందల కొద్ది మెయిల్స్ వస్తుంటాయి. ఆ మెయిల్స్‌లో కనీసం ఒకటి రెండు కూడా ఓపెన్ చేయరు. ఎందుకంటే.. మిగితావన్నీ పనికిరాని, అవసరం లేని మెయిల్సే ఉంటాయి. అందులో ఎక్కువగా ప్రమోషనల్ మెయిల్సే ఉంటాయి. ఈ పనికిరాని మెయిల్స్ అన్నీ ఆటోమెటిక్‌గా డిలీట్ అయితే ఎంత బాగుండు.. అని మీకు అనిపిస్తోందా? మీలాంటి వాళ్ల కోసమే జీమెయిల్లో ఈమెయిట్స్ను ఆటోమెటిక్‌గా డిలీట్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

నిజానికి.. జీమెయిల్లో ఉచితంగా 15జీబీ స్పేస్ మాత్రమే ఉంటుంది. అది నిండిపోతే.. ఎక్స్ట్రా జీబీ కావాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా.. 15 జీబీలో అవసరం ఉన్న మెయిల్స్‌ను మాత్రమే ఉంచుకొని.. అనవసరం అయిన మెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యేలా కూడా చేయొచ్చు. దాని వల్ల.. ఎక్స్ట్రా జీబీని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగా జీమెయిల్ ఇచ్చిన ఆ 15 జీబీ స్టోరేజ్‌నే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు.
Gmail Tips | ఆటోమెటిక్‌గా మెయిల్స్ డిలీట్ కావాలంటే ఇలా చేయండి
ఆటో డిలీట్ కోసం ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. జీమెయిల్ ఓపెన్ చేశాక.. సెర్చ్ బార్లో ఉండే ఫిల్టర్ ఐకాన్‌ను ఓపెన్ చేయాలి.
ఒకవేళ ఫిల్టర్ ఐకాన్ సెర్చ్ బార్లో కనిపించకపోతే.. సెట్టింగ్స్‌లో Filters and blocked addresses అనే ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Create a new filter అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ From అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ అంతగా ముఖ్యం కాని ఈమెయిల్ అడ్రస్ లేదా పేరును మెన్షన్ చేయాలి. ఉదాహరణకు మీకు జొమాటో లేదా వూట్, కొరా, ఫేస్బుక్, లింక్డిన్ లాంటి సంస్థల నుంచి మెయిల్స్ వద్దు అనుకుంటే.. అక్కడ ఆయా సంస్థలకు సంబంధించిన మెయిల్ ఐడీ లేదా.. బ్రాండ్ పేరు రాస్తే చాలు. మెయిల్ ఐడి తెలిస్తే అది ఇవ్వడం మేలు. లేకపోతే పేరు ఇస్తే సరిపోతుంది. కాకపోతే.. ఆ పేరుతో వచ్చే మెయిట్స్ అన్నింటినీ జీమెయిల్ డిలీట్ చేసేస్తుంది.

మెయిల్స్ అన్నీ ఇచ్చాక.. Create filter అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత Delete it అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ ఫీచర్ ద్వారా ఇప్పటికే ఉన్న పాత మెయిల్స్ డిలీట్ కావు కానీ.. భవిష్యత్తులో వచ్చే మెయిల్స్‌ను మాత్రం ఆటోమెటిక్‌గా డిలీట్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది.
Gmail Tips | పాత ఈమెయిల్స్‌ను కూడా డిలీట్ చేయాలంటే ఏం చేయాలి?
పాత ఈమెయిట్స్ను కూడా డిలీట్ చేయాలంటే.. దాని కోసం జీమెయిల్ సెర్చ్ బార్లో అవసరం లేని మెయిల్స్ ఐడీ లేదా పేరు ఎంటర్ చేస్తే.. దానికి సంబంధించిన మెయిల్స్ అన్నింటినీ చూపిస్తుంది. వాటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మరోసారి పేలిన రియల్మీ ఎక్స్‌టీ ఫోన్.. కంపెనీ ఏమన్నదో తెలుసా?
వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి 5జీ సేవలు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

