Realme XT | మరోసారి పేలిన రియల్మీ ఎక్స్‌టీ ఫోన్.. కంపెనీ ఏమన్నదో తెలుసా?
Realme XT | 2019లో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. మూడు కాన్ఫిగరేషన్స్‌లో ఈ ఫోన్ విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్ 712 ఎస్వోసీ ప్రాసెసర్‌తో 6.4 ఇంచ్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ
Realme XT | రియల్మీ ఎక్స్‌టీ సిరీస్ ఫోన్ మరోసారి పేలింది. పేలుడు వల్ల ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అయింది. గత సంవత్సరం కూడా రియల్మీ ఎక్స్‌టీ ఫోన్ పేలింది. 2019లో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. మూడు కాన్ఫిగరేషన్స్‌లో ఈ ఫోన్ విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్ 712 ఎస్వోసీ ప్రాసెసర్‌తో 6.4 ఇంచ్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లేతో విడుదలైన ఈ ఫోన్ తాజాగా మరోసారి పేలడంతో రియల్మీ యూజర్లు భయపడుతున్నారు.

ఈ ఫోన్ ఎక్కడ పేలిందో తెలియనప్పటికీ.. సందిప్ కుందు అనే ఓ ట్విట్టర్ యూజర్ తన ఫ్రెండ్ రియల్మీ ఎక్స్‌టీ ఫోన్ పేలిందని ట్వీట్ చేశాడు. పేలిన ఫోన్ ఫోటోలు కూడా పెట్టి.. రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్‌ను ట్యాగ్ చేశాడు.
దీంతో రియల్మీ ఇండియా సపోర్ట్ అకౌంట్ నుంచి వెంటనే అదే ట్వీట్‌కు రిప్లయి వచ్చింది. ఫోన్ పేలినందుకు క్షమాపణలు కోరుతూ.. ఫోన్ కొన్న వ్యక్తి వివరాలు అందించాలని ట్వీట్లో కోరింది.
దీంతో కుందు వెంటనే అతడి వివరాలు పంపించాడు. పేలిన ఫోన్‌ను తీసుకొని దగ్గర్లోని రియల్మీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో రిపోర్ట్ చేయాలంటూ అతడికి చెప్పామని.. అతడికి కొత్త ఫోన్ అందివ్వడమో లేక దానికి నష్టపరిహారం అందించడమో ఏదో ఒకటి కంపెనీ నుంచి అతడికి పరిహారంగా అందుతుందని కంపెనీ ట్వీట్ చేసింది.
అయితే.. ఆ ఫోన్ ఎలా పేలిందో తెలియనప్పటికీ ఆ ఫోన్ పేలినందుకు పూర్తి బాధ్యత కంపెనీ తీసుకుంటుందని చెప్పడంతో నెటిజన్లు కాస్త శాంతించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి 5జీ సేవలు
ఫాస్టెస్ట్ చార్జింగ్ డివైజ్.. భారత్‌లో షియోమి 11ఐ హైపర్‌చార్జ్ లాంచ్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

