Shock for Apple | ఆపిల్‌కు షాక్.. టెక్ దిగ్గజం అనైతిక ప్రాక్టీస్‌పై సీసీఐ అభ్యంతరం!
Shock for Apple | భారత్‌లో ఆపిల్ అనైతిక బిజినెస్ ప్రాక్టీసెస్‌పై సవివరంగా దర్యాప్తు చేయాలని సీసీఐ శుక్రవారం ఆదదేశించింది.

Shock for Apple | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్‌కు గట్టి షాక్ తగిలింది. ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా భారత్‌లో ఆపిల్ అనైతిక బిజినెస్ పద్దతులపై సవివరంగా దర్యాప్తు జరుపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం ఆదేశించింది. యాప్‌లను డెవలప్ చేయడానికి ఆపిల్ యాప్ స్టోర్ ఒక్కటే చానెల్. ప్రతి ఐ-ఫోన్, ఐ-పాడ్ల్లో ముందస్తుగా ఇన్స్టాల్ అయిన వారి ఐఓఎస్ కన్జూమర్లకు ఆ యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు.
ఆపిల్ యాప్ స్టోర్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆపిల్ యాప్‌స్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించరు. అటువంటి సర్వీసులు ఆఫర్ చేయకుండా యాప్ డెవలపర్లను నిరోధిస్తూ… వారితో అగ్రిమెంట్ చేసుకుంటుంది. దీనిద్వారా సామర్థ్యం గల యాప్ డెవలపర్ల నుంచి ఐఓఎస్‌కు యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆపిల్ నిరోధిస్తుందని సీసీఐ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. తమతో చేసుకున్న ఒప్పందం మేరకు శక్తి సామర్థ్యాలు గల యాప్ డిస్ట్రిబ్యూటర్లు, యాప్ స్టోర్ డెవలపర్లు.. యాప్ మార్కెట్లోకి వెళ్లేందుకు నిరాకరించడంతో పోటీతత్వ నిబంధనలను ఆపిల్ ఉల్లంఘిస్తున్నదని తేలిందని 20 పేజీల ఆదేశాల్లో సీసీఐ వెల్లడించింది.
ఐఓఎస్‌కు సంబంధించిన యాప్ స్టోర్ అనుబంధ శాస్త్రీయ, సాంకేతిక సేవల అభివృద్ధికి పరిమితులు విధించడం నేరమేనని స్పష్టం చేసింది. ఆపిల్ తన సొంత యాప్‌స్టోర్‌లో ఇన్నోవేషన్, ఇంప్రూవ్మెంట్ తగ్గించడం కూడా నిబంధనల ఉల్లంఘనేనని వెల్లడించింది. అందుకే సంస్థ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆధ్వర్యంలో సవివరమైన విచారణ జరుపాలిన సీసీఐ ఆదేశించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

