సంపూర్ణ ఆరోగ్యానికి నిద్రను మించిన ఔషధం లేదు. చక్కని నిద్రకోసం కాటన్, స్పాంజ్, ఫోమ్.. రకరకాల బెడ్స్ మార్కెట్లో ఉన్నాయి. వాటన్నిటికీ భిన్నంగా వేవ్ప్లస్ పేరుతో సరికొత్త మ్యాట్రస్ను తీసుకొచ్చింది ‘డ్యూరోఫ్లెక్స్’. ఈ ప్రత్యేకమైన మ్యాట్రస్తో నచ్చిన ఎత్తులో, నచ్చిన కోణంలో పడకని అమర్చుకునే వీలుంది. తీరిగ్గా కూర్చుని ల్యాప్‌టాప్‌తో ఆన్లైన్లో పనిచేసుకునేవారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అదనంగా యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, మూడురకాల మసాజ్ మోడ్స్, రకరకాల స్లీపింగ్ పొజిషన్స్.. ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా వెన్నెముక, తుంటి ఎముక సమస్యలను ఎదుర్కొనే వారికి చక్కని ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు తయారీదారులు. ఈ వేవ్ బెడ్ ఆన్లైన్ ధర రూ. 55 వేలు. మరిన్ని వివరాలు కావాలా? duroflexworld.comలో లభిస్తాయి.
ఈజిప్ట్ అనగానే గుర్తొచ్చేది పిరమిడ్లు, మమ్మీలు. దాదాపు 3000 ఏండ్లనాటి ఓ ఈజిప్ట్ మమ్మీ హైదరాబాద్‌లోని మ్యూజియంలోనూ భద్రంగా ఉంది. అయితే ఈతరం పిల్లలకు చరిత్రను పరిచయం చేసేందుకు మమ్మీని పోలిన ఫౌంటెన్ పెన్నును తీసుకొచ్చింది ఇటలీకి చెందిన కలాల తయారీ సంస్థ ‘మాంటెగ్రప్ప’. 1922లో బయట పడిన ‘ఫారో టుటంఖమన్’ అనే మమ్మీని పోలిన ఈ పెన్ను పైభాగం ఈజిప్టు సంప్రదాయ ముస్తాబుతో ఉంటే, కింది భాగం తెల్లవస్త్రంతో చుట్టినట్టు ఉంటుంది. 18 క్యారెట్స్ బంగారంతో తయారైన ఈ పెన్ను పసిమి ఛాయలో తళుక్కుమంటున్నది. లిమిటెడ్ ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చిన మమ్మీ పెన్ ధర రూ. 1,45,000 (సుమారు). పూర్తి వివరాలకు montegrappa.com చూడవచ్చు.
చిన్నపిల్లలకు ఇచ్చే బహుమతుల్లో బొమ్మలే ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు గృహాలంకరణలోనూ ఇవి చక్కగా ఒదిగిపోతున్నాయి. అయితే ఈ ప్లాస్టిక్, రబ్బరు బొమ్మలకు బదులు రకరకాల ఫ్యాబ్రిక్‌తో రూపొందించినవాటికి మార్కెట్లో గిరాకీ ఎక్కువ. పిల్లల అభిరుచులకు తగినట్టు కార్టూన్లు, బార్బీడాల్, శక్తిమాన్, సూపర్మాన్లను పోలినవీ ఉన్నాయి. యంత్రాల ప్రమేయమే లేకుండా చేతితో తయారు చేస్తున్న ఈ బొమ్మల ఆన్లైన్ ధర రూ.3,200 నుంచి మొదలు.
ఆఫీసులకు వెళ్లేవారి అలంకరణలో దుస్తులెంత ముఖ్యమో, బ్యాగులూ అంతే ప్రధానం. రకరకాల డ్రెస్సులకు నప్పేలా సరికొత్త బ్యాగులు వచ్చేశాయి. ఆడ, మగ తేడాలేకుండా ఎవరైనా వాడుకోవచ్చు. ైస్టెలిష్ లుక్‌తో అదరగొడుతున్న ఈ బ్యాగుల్లో ఫైల్స్, ల్యాప్‌టాప్, ఐడీకార్డులు, మొబైల్స్.. దేన్నయినా పెట్టుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన పాకెట్స్ ఉంటాయి. వీటిని చేత్తో పట్టుకోవచ్చు, భుజానికి తగిలించుకోవచ్చు. బయట నాణ్యమైన లెదర్‌తో, లోపల మేలైన కాటన్‌తో కుట్టడం వల్ల మన్నిక ఎక్కువ. చేయి తిరిగిన కళాకారుల చేతిలో ప్రాణం పోసుకోవడమే ఈ బ్యాగుల ప్రత్యేకత. సండే క్రాస్బాడీ, 9 టు 9 బ్యాక్‌ప్యాక్, ఆల్ టైమ్ టోట్, కమ్యూట్ మెసెంజర్ వంటి వేరియేషన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ైస్టెలిష్ బ్యాగులు రూ.1,499 నుంచి లభిస్తాయి. వివరాలకు daily-objects.com చూడవచ్చు.
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”