న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్య భయాలు వెంటాడటం, ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు (Layoffs) తెగబడుతుండగా తాజాగా ఐబీఎం నుంచి వేరుపడిన కిండ్రిల్ భారత్‌లో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
లేఆఫ్స్ గురించి ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం అందించామని, ఉద్యోగుల బకాయిలు కూడా క్లియర్ చేశామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనంతో కూడిన పరిహార ప్యాకేజ్‌ను వర్తింపచేస్తామని చెప్పారు. మరోవైపు కిండ్రిల్ భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు ఇటీవల వెల్లడించింది.
కిండ్రిల్‌లో పనిచేస్తున్న మొత్తం 90,000 మంది ఉద్యోగుల్లో 50 శాతం మంది భారత్‌లోనే పనిచేస్తున్నారని పేర్కొంది. మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, కీలకేతర విభాగాల ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం అధికంగా ఉందని సమాచారం.
ఇక ఇప్పటికే మెటా, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్ వంటి పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో టెక్ దిగ్గజం ఐబీఎం 3900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.
Read More
ChatGPT | ఈ ఉద్యోగుల వార్షిక వేతనం రూ. 2 కోట్ల పైమాటే..క్రేజీ జాబ్ సొంతం చేసుకోవాలంటే..!