న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌తో ఉద్యోగాలకు పెనుముప్పు పొంచిఉందన్న భయాలు వెంటాడుతుండగా ఈ ఏఐ టూల్స్ సృష్టించే ఉద్యోగాలకు రూ. కోట్లలో వేతనాలు ఉంటాయని చెబుతున్నారు. ఏఐ ఎదుగుదలతో ప్రాంప్ట్ ఇంజనీర్ల అవసరం ఏర్పడుతుందని, వీరి వార్షిక వేతనం ఏకంగా రూ. 2 కోట్లపైనే ఉంటుందని సమాచారం.
కండ్లు చెదిరే వేతన ప్యాకేజ్లతో కూడిన ఈ ఉద్యోగాలకు ఎలాంటి టెక్నాలజీ నేపధ్యం అవసరం లేదు. ఏఐ టూల్స్ వాడకంతో ప్రాంప్ట్ ఇంజనీర్లుగా పిలిచే న్యూ రోల్స్‌కు డిమాండ్ పెరుగుతుందని, వీరికి దాదాపు రూ. 2.75 కోట్ల వార్షిక వేతనం ఆఫర్ చేస్తారని బ్లూంబర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఏఐ టూల్స్, చాట్‌బాట్స్‌ను పరీక్షించి, వాటినుంచి మెరుగైన సమాధానాలను రాబట్టేలా ప్రాంప్ట్ ఇంజనీర్లు ప్రశ్నలు రూపొందిస్తారు. వీరికి భాషలపై పట్టు, నైపుణ్యాలు అవసరం.
ఈ జాబ్‌ల కోసం అభ్యర్ధులకు ఇంజనీరింగ్ డిగ్రీ, స్టెమ్ బ్యాక్‌గ్రౌండ్ వంటి అర్హతలు లేనందున ఎవరైనా ఈ క్రేజీ జాబ్స్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడవచ్చు. చాట్‌జీపీటీ క్రియేటర్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ సైతం ప్రాంప్ట్ ఇంజనీర్లకు గిరాకీ ఉంటుందని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. చాట్‌బాట్ కోసం మెరుగైన ప్రాంప్ట్ రాయడం అత్యధిక నైపుణ్యాలతో కూడిఉన్న టాస్క్ అని ఆల్ట్‌మన్ చేసిన ట్వీట్ టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారింది.
Read More
Sundar Pichai | చాట్‌జీపీటీ ప్రత్యర్ధి బార్డ్‌కు త్వరలో మేజర్ అప్‌గ్రేడ్స్ : గూగుల్
iPhone 14 | ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999కే ఐఫోన్ 14 సొంతం..!