Sundar Pichai | చాట్‌జీపీటీ ప్రత్యర్ధి బార్డ్‌కు త్వరలో మేజర్ అప్‌గ్రేడ్స్ : గూగుల్
పబ్లిక్ టెస్టింగ్‌కు తొలుత బార్డ్‌ను లాంఛ్ చేయగా తాజాగా ఈ ఏఐ టూల్‌పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్ : ఓపెన్ ఏఐ క్రియేట్ చేసిన వైరల్ చాట్‌బాట్ చాట్‌జీపీటికి దీటైన పోటీ ఇచ్చేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇటీవల బార్డ్‌ను లాంఛ్ చేసింది. పబ్లిక్ టెస్టింగ్‌కు తొలుత బార్డ్‌ను లాంఛ్ చేయగా తాజాగా ఈ ఏఐ టూల్‌పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) కీలక వ్యాఖ్యలు చేశారు. బార్డ్‌లో సమయానుకూలంగా అప్‌గ్రేడ్స్ ఉంటాయని, త్వరలోనే బార్డ్‌లో పురోగతి ఉంటుందని పిచాయ్ పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో బార్డ్‌లో మేజర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయని, ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుందని ఓ వార్తాసంస్ధతో ఆయన వెల్లడించారు. బార్డ్ త్వరలోనే అద్భుతంగా రెస్పాన్స్ అవుతుందని వచ్చే వారంలోనే మేజర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయని చెప్పారు. రీజనింగ్, కోడింగ్ సహా అన్ని విభాగాల్లో బార్డ్ మెరుగ్గా పనిచేసేలా పురోగతి సాధిస్తుందని అన్నారు.
మ్యాథ్స్ ప్రశ్నలకు కూడా ఇది మెరుగ్గా బదులివ్వనుందని, వచ్చే వారంలోనే మీరు ఈ పురోగతిని గమనించవచ్చని పిచాయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బార్డ్ లైట్‌వెయిట్, సమర్ధవంతమైన లామ్డా వెర్షన్‌పై రన్ అవుతోందని తెలిపారు. చాట్‌జీపీటీ రాకతో గూగుల్‌లో కోడ్ రెడ్ పరిస్ధితి తలెత్తిందన్న ప్రశ్నకు బదులిస్తూ తాను ఎన్నడూ కోడ్ రెడ్ జారీ చేయలేదని స్పష్టం చేశారు.
Read More
iPhone 14 | ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999కే ఐఫోన్ 14 సొంతం..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- AI tool
- bard
- sundar pichai
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

