iPhone 14 | ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999కే ఐఫోన్ 14 సొంతం..!
2022 సెప్టెంబర్‌లో భారత్‌లో లాంఛ్ అయిన ఐఫోన్ 14ను (iPhone 14) ఈకామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 37,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి ఈ డ్రీం ఫోన్‌ను అతి తక్కువ ధరకు దక్కించుకోవచ్చు.
న్యూఢిల్లీ : 2022 సెప్టెంబర్‌లో భారత్‌లో లాంఛ్ అయిన ఐఫోన్ 14ను (iPhone 14) ఈకామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 37,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి ఈ డ్రీం ఫోన్‌ను అతి తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. ఐఫోన్ 14 128జీబీ వేరియంట్ భారత్‌లో రూ. 79,999కి లాంఛ్ కాగా, ఇప్పుడు ఆ హాట్ డివైజ్ కనిష్ట ధరకు అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 128జీబీ వేరియంట్ రూ. 71,999కి లిస్టవగా హెచ్డీఎఫ్సీ కార్డుపై రూ. 4000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఐఫోన్ 14 ధర రూ. 67,999కి దిగివస్తుంది. ఇక పాత ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ. 30,000 వరకూ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూను ఆఫర్ చేస్తోంది. మీరు పాత ఐఫోన్ 12ను ఎక్స్ఛేంజ్ చేయదలుచుకుంటే ఫోన్ కండిషన్, బ్యాటరీ పనితీరు ఆధారంగా రూ. 30,000 వరకూ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూను పొందే వెసులుబాటు ఉంది.
ఇక యాపిల్ ఐఫోన్ 14 ఫీచర్ల విషయానికి వస్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ప్రైమరీ 12ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, సెకండరీ 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో పాటు వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిఉంది. 16 కోర్ ఎన్పీయూ, 5 కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో కూడిన ఏ15 బయోనిక్ చిప్‌ను కలిగిఉంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్‌పై రన్ అవుతుంది.
Read More
Italy Bans ChatGPT | చాట్‌జీపీటీపై ఇటలీ బ్యాన్.. కారణం అదేనా?!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

