న్యూఢిల్లీ : డిజైన్ సహా ఇతర విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 15 (iPhone 15) ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ హైలైట్స్ ఇవేనంటూ పలు లీక్స్ వెల్లడవుతున్నాయి. ఇక స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడల్ డైనమిక్ ఐలండ్ ఫీచర్‌ను కలిగిఉంటుందని పలు లీక్‌లు వెలుగుచూశాయి. రెగ్యులర్ మోడల్ ఐఫోన్ 14తో పోలిస్తే కొంచెం పెద్దగా 6.2 ఇంచ్ స్క్రీన్‌తో రానుంది.
హైఎండ్ ప్రొ మోడల్స్ న్యూ ఏ17 బయోనిక్ ఎస్ఓసీ చిప్సెట్తో ఐఫోన్ 15 ఏ16 బయోనిక్ చిప్‌ను కలిగిఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఐఫోన్ 15 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. ఐఫోన్ 14 సహా పాత యాపిల్ ఫోన్లకు భిన్నంగా ఈ సెగ్మెంట్లో కంపెనీ మార్పులు చేపట్టడం లేదని సమాచారం. పలు అండ్రాయిడ్ ఫోన్లు ఇప్పటికే 240డబ్ల్యూ, 300డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్న క్రమంలో యాపిల్ ఈ దిశగా చొరవ చూపాల్సి ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
240డబ్ల్యూ చార్జర్‌తో కేవలం 8 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జి అవుతుందని రియల్‌మి వెల్లడించింది. ఈ దిశగా రియల్‌మి, షియామి భారీ బ్యాటరీ సామర్ధ్యం, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. ఐఫోన్ 14 20డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిఉండగా ఐఫోన్ 15 45డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకొస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఐఫోన్ 15 ఐఫోన్ 14 సిరీస్ ప్రొ మోడల్స్‌లో చూసిన విధంగా 48 ఎంపీ వైడ్ కెమెరాతో హైఎండ్ మోడల్స్‌లో టెలిఫొటో లెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read More :