IBM | ఏఐపై ఐబీఎం సీనియర్ ఎగ్జిక్యూటివ్ కీలక వ్యాఖ్యలు
ఏఐ ప్రభావంపై ఐబీఎం (IBM) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబ్ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని వాడే మేనేజర్లు ఈ టూల్‌ను ఉపయోగించని వారి స్ధానాల్లోకి వస్తారని ఆయన అంచనా వేశారు.
న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్‌జీపీటీ రాకతో ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఏఐతో ఉద్యోగులపై వేటు తప్పదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఏఐ టూల్స్‌తో ఉత్పాదకత మెరుగవుతుందని మరికొందరు టెక్ దిగ్గజాలు చెబుతున్నారు. ఏఐ ప్రభావంపై ఐబీఎం (IBM) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబ్ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏఐని వాడే మేనేజర్లు ఈ టూల్‌ను ఉపయోగించని వారి స్ధానాల్లోకి వస్తారని ఆయన అంచనా వేశారు. ఏఐ ప్రభావం ప్రజలు పనిచేసే విధానంపై ఆధారపడి ఉంటుందని థామస్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొన్ని ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐదేండ్లలో ఏఐ, ఆటోమేషన్తో 30 శాతం ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఐబీఎం సీఈవో వెల్లడించారని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది.
మరోవైపు ఆర్ధిక మందగమనం, స్ధూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐబీఎం కూడా లేఆఫ్స్‌ను ప్రకటించింది. ఇక కంపెనీ షేర్లు రెండు శాతం మేర పతనమయ్యాయి. కంపెనీ సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ వ్యాపారం నాలుగో క్వార్టర్లో మందగించింది. 3900 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు ఐబీఎం ఇటీవల ప్రకటించింది.
Read More
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

