Whatsapp on International Calls | బ్లాక్ అండ్ రిపోర్ట్.. ఇంటర్నేషనల్ కాల్స్‌పై వాట్సాప్ రియాక్షన్ ఇదే..!
Whatsapp on International Calls | మోసగాళ్ల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్ ను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని వాట్సాప్ తన యూజర్లకు సూచించింది.
Whatsapp on International Calls | దేశంలో కొన్ని రోజులుగా వాట్సాప్ యూజర్లను ఇంటర్నేషనల్ కాల్స్ వేధిస్తున్నాయి. మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా వంటి దేశాల ఐఎస్డీ కోడ్లతో కూడిన నంబర్ల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ఆడియో కాల్స్ కాగా, మరికొన్ని వీడియో కాల్స్ ఉంటున్నాయి. ఈ కాల్స్ చేస్తున్న వారెవరు? వారి అసలు ఉద్దేశం ఏమిటి? ఇండియన్స్ నంబర్లు వారికి ఎలా తెలిశాయనే వివరాలైతే తెలియడం లేదు. కొన్ని రోజులుగా యూజర్లు తమకు వస్తున్న వాట్సాప్ కాల్స్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్యం దీనిపై రియాక్టయింది.
ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సదరు నంబర్ బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయాలని యూజర్లకు వాట్సాప్ సూచించింది. రిపోర్ట్ చేయగానే సదరు నంబర్ మీద తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. దేశీయంగా గానీ, విదేశాల నుంచి గానీ ఏ అనుమానాస్పద కాల్స్, ఎస్సెమ్మెస్‌లు వచ్చినా రిపోర్ట్ చేయాలని సలహా ఇచ్చింది. పర్సనల్ డిటైల్స్ తెలియకుండా ప్రైవసీ కంట్రోల్ లోకి వెళ్లి, కాంటాక్టుల్లోని వ్యక్తులకే కనిపించేలా ఏర్పాట్లు చేసుకోవాలని హితవు చెప్పింది. మోసగాళ్ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడానికి తాము ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపింది. తమ ప్లాట్ ఫామ్ మరింత సురక్షితంగా తీర్చిదిద్దడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.
మామూలుగా అంతర్జాతీయ కాల్స్ చేసేవారు ఫేక్ జాబ్ ఆఫర్లతో యూజర్లకు ఆకట్టుకోవడానికి ట్రై చేస్తారు. కొన్నిసార్లు యూ-ట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టండి.. వీడియోకు భారీ మొత్తం పే చేస్తామని ఆఫర్ చేస్తారు. భారీ మొత్తం చెల్లించే ఆఫర్ చూపి, సైబర్ మోసగాళ్లు పెద్దమొత్తంలో దోచుకునే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరికొందరు మోసగాళ్లు.. వర్క్ ఫ్రం హోం పేరిట మోసాలు చేస్తున్నారని టెక్నాలజీ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు. కనుక అనుమానాస్పద కాల్స్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఈ తరహా కాల్స్ వస్తే సదరు నంబర్ మీద క్లిక్ చేస్తూ.. త్రీ డాట్స్ మెనూలోకి వెళ్లి ‘బ్లాక్’ చేయాలని సూచిస్తున్నారు. ఇలా ఒకసారి బ్లాక్ చేసిన నంబర్ నుంచి తర్వాత ఎటువంటి కాల్స్, ఎస్సెమ్మెస్‌లు రావు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

