సోమవారం 13 జూలై 2020
Science-technology - Jun 01, 2020 , 02:28:09

గుండెకు ‘వర్చువల్‌'శస్త్ర చికిత్స

గుండెకు ‘వర్చువల్‌'శస్త్ర చికిత్స

న్యూఢిల్లీ: ఈజిప్ట్‌ బాలుడి (11)కి క్లిష్టమైన గుండె ఆపరేషన్‌ను చేయడంలో చైన్నైలోని ఎంజీఎం దవాఖాన వైద్యులు విజయవంతమయ్యారు. సాధారణ శస్త్ర చికిత్స పద్దతిలో విఫలమయ్యే అవకాశాలు ఉన్న ఈ ఆపరేషన్‌ ‘వర్చువల్‌ రియాలిటీ’ సాయంతో చేయ డం విశేషం. ఊపిరితిత్తులపై ఒత్తిడి, గుండె సమస్యతో బాధపడుతున్న ఈజిప్ట్‌ నుంచి ఓ బాలుడు చికిత్స కోసం లాక్‌డౌన్‌కు ముందే భారత్‌కొచ్చాడు. బాలుడి గుండెలోని ఎడమ గది లో బ్యాటరీ సాయంతో పనిచేసే మెకానికల్‌ పంపు అమర్చాలి. దీన్ని గుండెలోని గదిలో ఎక్కడ అమర్చాలో వైద్యులు అంచనాకు రాలేకపోయారు. దవాఖాన డైరెక్టర్‌ డాక్టర్‌ కేకే బాలకృష్ణన్‌ ఐఐటీ-మద్రాస్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ను సంప్రదించి, ఆయన సలహామేరకు ఐఐటీ-మద్రాస్‌ నిపుణులు అభివృద్ధి చేసిన ‘వర్చువల్‌ రియాలిటీ’ సాయంతో 3డీలో పలు విధానాల్లో పంపును ఇంప్లాంట్‌ చేశారు


logo