కుభీర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కుభీర్ ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను ( Indiramma Houses ) స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో మాట్లాడుతూ ఆయన స్టెప్ బై స్టెప్ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు డబ్బులు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు.
వివిధ స్థాయిలో ఉన్న నిర్మాణాలను త్వరతిగతిన పూర్తి చేసి సహకరించాలని సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన స్థల సేకరణ పై చర్చించారు. స్మశాన వాటికలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి కనీస వసతులు కల్పించాలని వైద్యుడు విజేష్కు సూచించారు. అక్కడికి వచ్చిన రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.