గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత | స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

హైదరాబాద్ : స్థానిక సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
స్థానిక సంస్థలకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినందుకు గాను రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్, జెడ్సీటీసీలు, ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 202-21 బడ్జెట్లో జిల్లా పరిషత్ లకు రూ. 252 కోట్లు, మండల పరిషత్ లకు రూ.248 కోట్లు కేటాయించిందన్నారు.
పరిపాలనా వ్యవస్థలో స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర కీలకమన్న ఎమ్మెల్సీ కవిత, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామన్నారు.
జిల్లా పరిషత్ లకు, మండల పరిషత్ లకు నిధుల కేటాయింపునకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఘం ప్రతినిధులు కొనియాడారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు అందరితో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ప్రతినిధులు గుర్తు చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ పంచాయితీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. చింపుల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ,ఉపాధ్యక్షులు అశోక్ రావు, రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ , రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పేరుమల్ల గుట్టయ్య, ఉపాధ్యక్షులు కావలి శ్రీశైలం, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ ,గౌరవ అధ్యక్షుడు నాగేష్ వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

