హైదరాబాద్ :మేడారంలో సమ్మక్క, సారక్క జాతర వైభవంగా కొనసాగుతుంది. జాతర అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మేడారం జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క, సారక్కను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో మంత్రి సీతక్క ఎమ్మెల్యేను ఆపార్యంగా పలకరించారు.