MIW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ప్లే ఆఫ్స్ బెర్తులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చేసింది. చావోరేవో పోరులో తలపడుతున్న గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌లో గెలిచిన జట్టు ముందంజ వేయడం ఖాయం. దాంతో, ఇరుజట్లు విజయంపై కన్నేసిన పోరులో టాస్ గెలిచిన అష్లీ గార్డ్నర్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో 190 రన్స్ చేసినా హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధశకంతో ఓటమి పాలైన గుజరాత్ ఈసారి గెలుపుపై ధీమాతో ఉంది.
గుజరాత్ తుది జట్టు : బేత్ మూనీ(వికెట్ కీపర్), సోఫీ డెవినె, అనుష్క శర్మ, అష్లీ గార్డ్నర్(కెప్టెన్), జార్జియా వరేహం, భారతి ఫుల్మాలి, కనికా ఆహుజా, కష్వీ గౌతం, తనూజ కన్వర్, రేణుకా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్.
ముంబై తుది జట్టు : హేలీ మాథ్యూస్, సంజీవన్ సంజన, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమన్‌జోత్ కౌర్, అమేలియా కేర్, రహిల ఫిర్దౌస్(వికెట్ కీపర్), సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నం ఇస్మాయిల్, పూనమ్ ఖెమ్నర్.
A look at the Playing XIs of @Giant_Cricket and @mipaltan 🙌
Updates ▶️ https://t.co/0ABkT4KS2M #TATAWPL | #KhelEmotionKa | #GGvMI pic.twitter.com/1aYZMMn73r
— Women’s Premier League (WPL) (@wplt20) January 30, 2026
ప్రస్తుతం 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ బెర్తుకు చేరువలో ఉంది. గత మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆ జట్టు.. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడిస్తే చాలు. దర్జాగా10 పాయింట్లతో బెర్తు దక్కించుకుంటుంది. ఒకవేళ ముంబై విజయం సాధిస్తే.. 8 పాయింట్లతో ఇరుజట్లు రేసులోనే ఉంటాయిది. అయితే.. చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ చేతిలో ఢిల్లీ ఓడిందంటే గుజరాత్, ముంబై నాకౌట్‌కు దూసుకెళ్తాయి.