రామగిరి, జనవరి 30 : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్, యూఎఫ్జే అకాడమీ, బొట్టుగూడ హై స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “స్వదేశీ వస్తువులు ప్రోత్సహిద్దాం, స్వదేశీ జ్ఞానం వర్ధిల్లాలి” అనే నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆలోచనలు నేటి సమాజానికి మరింత అవసరమని, గాంధీ మార్గాన్ని అనుసరించిన దేశాలు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు. యువత గాంధీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల ముఖ్య సలహాదారులు ఎం.వి.గోనారెడ్డి, ప్రధాన కార్యదర్శి యానాలా ప్రభాకర్ రెడ్డి, గాందరి ప్రభాకర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వైస్ చైర్మన్ నీరుడు దయాకర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి పాముల అశోక్, రిటైర్డ్ హెచ్ఎం కరుణాకర్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి గిరిధర్ గౌడ్, పీడీ బొమ్మపాల గిరిబాబు, మహిళా అధ్యక్షురాలు కందిమల్ల నాగమణి రెడ్డి, సుధారాణి, సరళ, జీనుగు జ్యోతి, వెంకట్ రెడ్డి, యూజేఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, జవహర్ లాల్, శ్రీనివాస్, రాఘవేందర్ రావు పాల్గొన్నారు.

Ramagiri : నల్లగొండలో శాంతి ర్యాలీ