(Heart and Cataract) కంటి శుక్లంతో బాధపడేవారిలో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కంటిశుక్లం శస్త్రచికిత్స చేసుకున్నవారిలో గుండె జబ్బుల కారణంగా మరణించే ప్రమాదం 36 శాతం వరకు ఉంటుంది. ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గుండెకు కాటరాక్ట్ మధ్య సంబంధంపై 1999 – 2008 మధ్య 15 వేల మంది అమెరికాలోని రోగులపై పరిశోధనలు చేపట్టారు. వారి ఆరోగ్య డాటాను విశ్లేషించారు. 40 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో 2 వేల మంది కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నవారే. ఈ రోగులకు ఇతర కారణాల వల్ల మరణించే ప్రమాదం 13 శాతం ఉన్నదని రిపోర్ట్‌లో తేలింది.
గుండెకు కంటిశుక్లం మధ్య సంబంధం కనుగొన్నట్లు పరిశోధకుడు డాక్టర్ మాథ్యూ గోర్స్కీ తెలిపారు. అధిక ఒత్తిడి.. డిప్రెషన్లో నివసించే వ్యక్తులకు కంటిశుక్లం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కంటిశుక్లం వల్ల ధమనులు సన్నగా మారి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. కళ్లను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చునని ఈ పరిశోధనా ఫలితాలు సూచిస్తున్నాయని చెప్తున్నారాయన. ముఖ్యంగా వృద్ధులు లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారు కంటి శుక్లాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి.
కంటిశుక్లం అంటే కళ్లపై తెల్లటి పాచెస్ వంటివి ఏర్పడటం. ఇవి వచ్చినప్పుడు ప్రతిదీ అస్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి సమయాల్లో రోగులు నడవాలంటే ఇబ్బంది పడుతారు. సకాలంలో చికిత్స చేయించుకోనిపక్షంలో శాశ్వతంగా దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ధూమపానం, మద్యం సేవించే వృద్ధుల్లో కంటి శుక్లం ప్రమాదం మరింత పెరుగుతుంది.
మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..