రోబోలు వివిధ రకాలుగా తయారవుతూ మనకు సేవలందిస్తున్నాయి. హోటళ్లలో సప్లయిర్ మాదిరిగా పనిచేసిన రోబోలు.. ఇటీవల కరోనా వైరస్ నేపథ్యంలో మందులు అందించి శహబాష్ అనిపించుకున్నాయి. కుక్కలు తయారయ్యాయి.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా కూడా దర్శనమిచ్చాయి. అయితే, బోస్టన్ డైనమిక్స్ సంస్థ మరో అడుగు ముందుకేసి అచ్చు మనిషి మాదిరిగానే పార్కర్ ( ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూకడం) (Parkour Robot) చేస్తూ ఔరా అనిపిస్తున్నాయి. పార్కర్ చేస్తున్న బోస్టర్ డైనమిక్స్ రోబోల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ తయారుచేసిన రోబోలు ఇప్పటికే సింగపూర్ పార్క్‌లు విధుల్లో చేరి కరోనా సమయంలో భౌతిక దూరం పాటించాలంటూ ప్రజలను చైతన్యం చేసింది. ఈ సంస్థ నుంచే వచ్చిన కుక్క, డ్యాన్సులు చేసిన రోబోలు ఎంతగానో అలరించాయి. ఇప్పుడు ఇదే సంస్థ మరో అడుగు ముందుకేసి పార్కర్ చేసే రోబోలకు ప్రాణం పోసింది.
మంగళవారం పార్కర్ చేస్తున్న రెండు రోబోల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శిక్షణ పొందిన వారి మాదిరిగానే ఈ రెండు రోబోలు పార్కర్ చేయడం విశేషంగా ఆకట్టుకున్నాయి. పార్కర్ చేసిన అట్లాస్ అనే రోబో.. 86 కిలోల బరువు, 5 ఫీట్ల పొడవుతో ఉన్నది. ఇది కదలికల కోసం హైడ్రాలిక్స్, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగిస్తుంది. నియంత్రణల విషయానికొస్తే, ఇది మూడు ఆన్‌బోర్డ్ కంప్యూటర్లను కలిగి ఉన్నది. అట్లాస్ బ్యాక్ ఫ్లిప్స్ కూడా చేస్తుండటం విశేషం.
Atlas, a humanoid robot created by Boston Dynamics, uses hydraulics and battery-powered electric motors for movement. Atlas is capable of doing backflips and has been showing off its new skill: parkour https://t.co/gNYfTnBPR6 pic.twitter.com/x8LXUJtExH
— Reuters (@Reuters) August 18, 2021
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
త్వరలో మళ్లీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
ఆఫ్ఘాన్‌ను తాలిబాన్ ఆక్రమించుకోవడం సబబే: సజ్జాద్ నోమాని
ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు..
నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్‌పై సున్నమేశారు..!