Women Disappear : వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్‌పై సున్నమేశారు..!
Women Disappear : మహిళల భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఎన్నో అనుభవాలను చూసిన మహిళలు.. ప్రస్తుతం బయటకు...

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ తమ గుప్పిట్లోకి తీసుకున్న అనంతరం పరిస్థితులు మెల్లమెల్లగా మారుతున్నాయి. ముఖ్యంగా మహిళల (Women Disappear) భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఎన్నో అనుభవాలను చూసిన మహిళలు.. ప్రస్తుతం బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఇప్పటివరకు బహిరంగంగా రోడ్లపై తిరిగిన మహిళలపై తాలిబాన్ బ్రాండ్ పడనున్నది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న క్షణాల్లోనే మహిళల కటౌట్లు, యాడ్ ఫొటోలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తున్నది.
కాబూల్‌లోని ఓ మహిళా క్షౌరశాల వద్ద ఏర్పాటుచేసిన మహిళా మోడల్స్ ఫొటోలపై సున్నం వేసి చెరిపేస్తున్న దృశ్యాన్ని ఆఫ్ఘాన్‌కు చెందిన ఫొటో జర్నలిస్ట్ లోత్ఫుల్లా నజాఫిజాదా బయటి ప్రపంచానికి చాటేందుకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ‘మహిళల తొలగింపు’ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోపై పలువురు నెటిజెన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. వాయవ్య ఫారియాబ్ ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాల్లో మగ తోడు లేకుండా వచ్చిన మహిళలు ఎలాంటి వస్తువులను విక్రయించవద్దని తాలిబాన్ హెచ్చిరించింది.
1996-2001 మధ్య ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన సమయంలో తాలిబాన్ కఠినమైన ఇస్లామిక్ చట్టాన్ని విధించింది. మహిళలు పనులు చేయడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మహిళల హక్కులు రక్షిస్తామని తాలిబాన్ పదేపదే పేర్కొంటున్నప్పటికీ.. అణచివేత నియమాలు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తున్నది. ‘పోరాటయోధులతో’ వివాహం కోసం 15 ఏండ్ల వయసు పైబడిన బాలికలు, 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వితంతువుల జాబితాను అందించాలని తాలిబాన్ ఆఫ్ఘన్లను ఆదేశించినట్లు పలు నివేదికలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
లాహోర్‌ను పాకిస్తాన్కిచ్చిన రాడ్‌క్లిఫ్
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

