America Water : అమెరికాలో నీటికి కటకట
America Water : అగ్రరాజ్యం అమెరికాలో నీటి కొరత ఏర్పడింది. కొన్ని రాష్ట్రాలు నీటి కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ లేక్ మీడ్ జలాశయంలో నీరు...

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో నీటి కొరత (America Water) ఏర్పడింది. కొన్ని రాష్ట్రాలు నీటి కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని అమెరికా తొలిసారి అంగీకరించింది. ప్రభుత్వం ప్రకారం, ఈ జలాశయంలో 10 అడుగుల వరకు మాత్రమే నీరు ఉన్నది. ఇది కొన్ని రాష్ట్రాలపై నేరుగా ప్రభావం చూపుతున్నది. దాంతో 10 రాష్ట్రాల గవర్నర్లు తమ రాష్ట్రాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని, దీని కింద ఆర్థిక సహాయం అందించాలని జో బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు.
రిజర్వాయర్‌లో నీటి కొరత కారణంగా అరిజోనా, నవాడా, మెక్సికోకు అందించే నీటిలో కోత విధించే అవకాశాలు ఉన్నాయని యూఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, అరిజోనాలో దాదాపు 18 శాతం, నవాడాలో 7 శాతం, మెక్సికోలో 5 శాతం నీరు తగ్గుదల ఉండనున్నది. నీటి కరువును ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సాయం అందించాలని 10 రాష్ట్రాలు అమెరికా ప్రభుత్వానికి నివేదించాయి. చరిత్రలో అతిపెద్ద కరువుగా ప్రెసిడెంట్ బైడెన్‌కు రాసిన లేఖలో గవర్నర్లు అభివర్ణించారు. నీటి కరువు కారణంగా మొత్తం పంటలు నాశనమయ్యాయని వారు తెలిపారు. ఫలితంగా అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చునని వారు బైడెన్‌కు విన్నవించారు.
దేశంలోని పశ్చిమ ప్రాంతంలో దాదాపు 63 శాతం నీటి కొరత ఉన్నట్లు యూఎస్ డ్రాఫ్ట్ మానిటర్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం, పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 1930 లో నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్ అయిన మీడ్ సరస్సు.. అమెరికాలోని నవాడా-అరిజోనా సరిహద్దులో ఉన్నది.
ఇవి కూడా చదవండి..
మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
లాహోర్‌ను పాకిస్తాన్కిచ్చిన రాడ్‌క్లిఫ్
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

