Tejas Express : మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక
Tejas Express :రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మహిళలకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది...

న్యూఢిల్లీ : రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మహిళలకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో (Tejas Express) ప్రయాణించే మహిళలకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే మహిళలు ఆగస్టు 24 వరకు టికెట్ ఛార్జీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారని ఒక ప్రకటనలో ఐఆర్సీటీసీ తెలిపింది.
మహిళా ప్రయాణికులు ఆగస్టు 24 లోపు ఈ ఆఫర్‌ను వినియోగించుకుని ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ కింద క్యాష్‌బ్యాక్ మొత్తం టిక్కట్ బుక్ చేయబడిన ఖాతాకే జమ చేస్తారు. ప్రకటన రావడానికి ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి, ఆఫర్ వ్యవధిలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు కూడా క్యాష్‌బ్యాక్ పొందడానికి అర్హులు. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున 4 నెలల క్రితం రద్దు చేసిన ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలను తిరిగి ఆగస్టు 7 నుంచి ప్రారంభించింది. ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Akhanda Movie : అక్టోబర్ 8న బాలయ్య ‘అఖండ’.. అంటే ‘ట్రిపుల్ ఆర్’ మళ్లీ వాయిదా..?
భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనం తాలిబన్లు స్వాధీనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

