భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనం తాలిబన్లు స్వాధీనం

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి ఆదివారం ప్రవేశించిన తాలిబన్లు క్రమంగా అన్ని అధికార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కాబూల్‌లో భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని సాయుధ తాలిబన్లు సోమవారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్ చైర్లో ఒక తాలిబన్ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉంచాడు. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు సాయుధ తాలిబన్లు కూర్చున్నారు. పార్లమెంట్ లోపల ఉన్న ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జెండాను తొలగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు గతంలో మాదిరిగా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్‌ను పునరుద్ధరించడంతోపాటు బహిరంగ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది.
Taliban have entered the Parliament of Afghanistan. This building was built by India.#Kabul #Taliban #Afghanistan #KabulHasFallen pic.twitter.com/BEYowxdstA
— Wajahat Kazmi (@KazmiWajahat) August 16, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

