Moideen Yassin : మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
మలేషియా ప్రధానమంత్రి మొయిదీన్ యాసిన్ (Moideen Yassin) సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. పార్లమెంట్లో మెజార్టీ కోల్పోవడంతో ప్రధానమంత్రి పదవికి యాసిన్...

కౌలాలంపూర్: మలేషియా ప్రధానమంత్రి మొయిదీన్ యాసిన్ (Moideen Yassin) సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. పార్లమెంట్లో మెజార్టీ కోల్పోవడంతో ప్రధానమంత్రి పదవికి యాసిన్ రాజీనామా సమర్పించారు. 18 నెలల కన్నా తక్కువ కాలం పాటు ప్రధానమంత్రిగా మొయిదీన్ యాసిన్ కొనసాగారు. మలేషియా చక్రవర్తిని కలిసి కేబినెట్ రాజీనామా సమర్పించినట్లు మంత్రి జమాలుద్దీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. కాగా, యునైటెడ్ మలేషియా నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఇద్దరు మంత్రులు కూడా కేబినెట్‌కు రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నది.
అతి తక్కువ కాలం పాటు ప్రధానిగా కొనసాగిన మొయిదీన్ యాసిన్ నిష్క్రమణ మలేషియాలో కొత్త రకమైన సంక్షోభాన్ని తీసుకురానున్నది. దీనితో పాటు కొవిడ్-19 పరిస్థితి కూడా అక్కడ మరింత ఉద్ధృతంగా మారే అవకాశాలున్నాయి. అత్యున్నత పదవిని పొందడం కోసం ఇప్పటికే ఉప ప్రధానమంత్రి ఇస్మాయిల్ సబ్రీతోపాటు పలువురు నాయకులు పోరాటం ప్రారంభించారు. అయితే, చాలామంది మొయిదీన్ యాసిన్ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటుండటం విశేషం.
మలేసియా ప్రధానిగా 2020 మార్చిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంపై మొయిదీన్ పట్టు అనిశ్చితంగా ఉన్నది. అయితే కీలక మిత్రుడు మద్దతును ఉపసంహరించుకోవడంతో మొయిదీన్ మెజార్టీ కోల్పోయాడు. తనకు మెజార్టీ లేదని ఆగస్టు 13 న మొహిదీన్ ప్రకటించాడు. సంస్కరణలకు బదులుగా విశ్వాస ఓటులో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన విపక్ష చట్టసభ సభ్యులను కోరారు. కొవిడ్ వ్యాప్తిని బట్టి 2022 జూలై నాటికి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలతోపాటు మిత్రపక్షమైన యూఎంఎన్ఓ.. మొయిదీన్ ప్రతిపాదనను తిరస్కరించాయి. దాంతో మొహిదీన్ తన రాజీనామాను సమర్పించాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
లాహోర్‌ను పాకిస్తాన్కిచ్చిన రాడ్‌క్లిఫ్
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక
అక్టోబర్ 8న బాలయ్య ‘అఖండ’.. అంటే ‘ట్రిపుల్ ఆర్’ మళ్లీ వాయిదా..?
భారత్ నిర్మించిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనం తాలిబన్లు స్వాధీనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

