Netaji : నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
Netaji : నేతాజీ సుభాష్ చంద్ర బోస్.. 76 ఏండ్లు గడిచినా ఆయన మరణం ఇంకా ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. తైపీలో 1945 లో ఇదే రోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని చరిత్రకారులు నమ్ముతున్నారు. అయితే,...

నేతాజీ సుభాష్ చంద్ర బోస్.. 76 ఏండ్లు గడిచినా ఆయన మరణం ఇంకా ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. తైపీలో 1945 లో ఇదే రోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని చరిత్రకారులు నమ్ముతున్నారు. అయితే, దానికి సంబంధించిన అధికారిక పత్రాలేవీ అందుబాటులో లేవు. అయితే, అజ్ఞాతంలో గడిపారని మరికొందరు చరిత్రకారులు చెప్తుంటారు. ఇన్నేండ్లయినా ఆయన మరణం గురించి అనుమానాలు ఇంకా మన మదిలో కొనసాగుతూనే ఉన్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్ నుంచి మంచూరియాకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం కనుమరుగై పోయింది. దాంతో ఆయన ఆ ప్రమాదంలో చనిపోయారని భావిస్తున్నారు. అయితే, తాయ్‌హోక్ విమానాశ్రయం వద్ద జరిగిన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని ఐదు రోజుల తర్వాత టోక్యో రేడియో ఒక వార్తను ప్రసారం చేసింది. ఈ ప్రమాదంలో నేతాజీ శరీరం పూర్తిగా కాలి బూడిదైందని కూడా తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించారని భావిస్తున్న నేతాజీ చితాభస్మాన్ని ఈనాటికీ టోక్యోలోని రంకోజీ దేవాలయంలో భద్రపరిచారు. అయితే, 1945 లో తమ భూభాగంలో ఎలాంటి విమానప్రమాదం జరుగలేదని తైవాన్ ప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో స్పష్టం చేసింది.
76 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇవ్వాల్టికీ మిస్టరీగానే ఉన్నది. ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఇప్పటివరకు మూడు కమిషన్లు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఆయన ఎలా చనిపోయారో గుర్తించాలని అప్పట్లో నియమించిన జస్టిస్ ఎంకే ముఖర్జీ ఏక సభ్య కమిషన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, కానీ ఆయన ఎలా చనిపోయారో గుర్తించలేకపోతున్నామని ఈ కమిషన్ తేల్చింది. ఇలాఉండగా, 1960-87 మధ్యకాలంలో అయోధ్య సమీపంలోని ఫైజాబాద్‌లో నివసించిన గుమ్నామీ బాబా అనే సాధువే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చాలా మంది నమ్మడం విశేషం.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2013: పశ్చిమ బెంగాల్లో బస్సు పేలుడులో ఆరుగురు దుర్మరణం
2008: పాకిస్థాన్ అధ్యక్ష పదవికి పర్వేజ్ ముషారఫ్ రాజీనామా
1951: దేశంలో మొదటి ఐఐటీ ఖరగ్‌పూర్ స్థాపన
1934: సినీ దర్శకుడు, గేయ రచయిత, కవి గుల్జార్ జననం
1920: అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన ప్రభుత్వం
1900: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ అయిన విజయ్ లక్ష్మి పండిట్ జననం
1868 : హీలియం అనే మూలకాన్ని కనుగొన్న జూల్స్ జన్సెన్
ఇవి కూడా చదవండి..
ట్విట్టర్ బర్డ్ ఫ్రై.. ఎందుకు చేశారంటే..?
మహారాజా రంజిత్ సింగ్‌కు తీరని అవమానం..!
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్‌పై సున్నమేశారు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

