బుధవారం 05 ఆగస్టు 2020
Science-technology - Aug 01, 2020 , 19:15:09

అబ్బురపరుస్తున్న అంతరిక్ష సీతాకోకచిలుక!

అబ్బురపరుస్తున్న అంతరిక్ష సీతాకోకచిలుక!

న్యూయార్క్‌: అంతరిక్షంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఓ అందమైన సీతాకోక చిలుక ఆకృతి పరిశోధకుల కెమెరాకు చిక్కింది. అరుదైన చిత్రాన్ని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ఈఎస్‌వో) అత్యంత పొడవైన టెలీస్కోప్‌ (వీఎల్‌టీ)ని ఉపయోగించి గుర్తించింది. ఎన్‌జీసీ 2899 అనే ఒక సీతాకోక చిలుకను పోలి ఉండే ఓ గ్యాస్‌బబుల్‌ను కెమెరాలో బంధించింది. ఇంతకుముందు ఇలాంటి బబుల్‌ తారసపడలేదని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

‘ఈ అంతరిక్ష సీతాకోకచిలుక 3000, 6500 కాంతి సంవత్సరాల మధ్య వెలా  దక్షిణ రాశిలో ఉంది. దీనిని ది సెయిల్స్‌ అని కూడా పిలుస్తారు. ఈ గ్యాస్ బుడగ ఉష్ణోగ్రత 10,000 డిగ్రీల వరకు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు గల నెబ్యులాల మాతృ నక్షత్రం నుంచి వెలువడే రేడియేషన్‌ కారణంగా ఈ బుడగలు ఏర్పడుతాయి.’ అని ఈఎస్‌వో పేర్కొంది. దీంతో నెబ్యులాలోని హైడ్రోజన్‌ వాయువు, ఆక్సిజన్‌ గ్యాస్‌ చుట్టూ చేరి, ఎర్రటి హాలోలో నీలిరంగులో మెరుస్తుందని వివరించింది. ఈ అంతరిక్ష సీతాకోకచిలుక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అందరూ దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.  నెటిజన్లు వావ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo