న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ (Microsoft) ఈవెంట్ వేదికగా తన సిస్టమ్స్ పనిచేసేందుకు రెండు ప్రత్యేక చిప్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు టెక్ దిగ్గజం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మైయ ఏఐ యాక్సిలరేటర్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కోబాల్ట్ సీపీయూగా ఈ చిప్స్‌ను పిలుస్తారు. మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవల్లో భిన్న టాస్క్‌ల కోసం ఈ చిప్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
మైయ ఏఐ యాక్సిలరేటర్ చిప్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌లు, జనరేటివ్ ఏఐపై ఫోకస్ పెట్టనుండగా, కోబాల్ట్ సీపీయూ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ విభాగంలో జనరల్ కంప్యూటింగ్ జాబ్స్‌ను హ్యాండిల్ చేస్తుంది. సమగ్ర మౌలిక వ్యవస్ధలను సృష్టించే క్రమంలో మైక్రోసాఫ్ట్ ప్రణాళికలో ఈ చిప్స తుది సొల్యూషన్‌గా ముందుకు రానున్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పాటు కంపెనీ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పనిచేసేలా ఈ చిప్స్‌ను డిజైన్ చేశారు.
వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిప్స్ మైక్రోసాప్ట్ డేటా సెంటర్స్‌కు చేరవేస్తారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్, అజ్యూర్ ఓపెన్ఏఐ సర్వీస్ వంటి సేవలను తొలుత ఈ చిప్స్ రన్ చేస్తాయి. లేటెస్ట్ క్లౌడ్, ఏఐ టెక్నాలజీలను వాడాలని కోరుకునే కస్టమర్లకు తోడ్పాటుగా సమర్ధవంతమైన, మెరుగైన, పర్యావరణ అనుకూల కంప్యూటింగ్ పవర్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ చిప్స్‌ను మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది.
Read More :