బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Sep 09, 2020 , 00:59:43

కార్యకర్తలకు అండగా పార్టీ

కార్యకర్తలకు అండగా పార్టీ

  • పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

గుమ్మడిదల: కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త చిలుక పెంటయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గతంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు సీఎం కేసీఆర్‌ ప్రమాద బీమా చేయించిన విషయం తెలిసిందే. మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మృతుడి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తూ వారిని ఆపద కాలంలో ఆదుకోవడానికి రూ.2 లక్షల బీమా అమలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకోవడం హర్షనీయమన్నారు. వీరితోపాటు జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ తిరుమలవాసు, మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, యువత అధ్యక్షుడు నరహరి, మాజీ ఉపసర్పంచ్‌ రాజు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, లక్ష్మణ్‌, బాలయ్య, శేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు. logo