నటీనటులు:
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి
నిర్మాణ సంస్థ : లక్కీ మీడియా
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి,
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్,
ఎడిటర్: విజయ్ వర్థన్
Roti Kapda Romance Review | ట్రెండ్‌కు తగ్గట్టుగా తెరకెక్కించే కంటెంట్ ఓరియెంట్ సినిమాలను ఆదరించే విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీటిలో యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలకు మార్కెట్లో సూపర్ క్రేజ్ ఉంటుంది. ఆ కోవలోనే సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చింది ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapda Romance).
విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ లాంటి సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించారు.
నవంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా పడి ఫైనల్ నేడు (నవంబర్ 28)ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా లవ్, బ్రేకప్ కాన్సెప్ట్‌తో నయా పంథాలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుందనేది తెలుసుకుందాం.
కథ :
చిన్ననాటి నుంచి స్నేహితులైన ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష (హర్ష నర్రా), ఆర్జే సూర్య (తరుణ్), సాఫ్ట్ వేర్ రాహుల్ (సందీప్ సరోజ్), విక్కీ (సుప్రజ్ రంగ) అంతా కలిసి ఒకే గదిలో ఉంటారు. వీరిలో విక్కీ మాత్రం ఏ పని చేయకుండా తన రూంమేట్స్ సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే హాయ్‌గా సాగుతున్న వీరి జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు వస్తారు.
తమ జీవితంలోకి అమ్మాయిలు వచ్చిన తర్వాత పెళ్లి కాన్సెప్ట్ వచ్చేసరికి నలుగురు తప్పించుకుని తిరుగుతారు. ఇంతకీ నలుగురు అమ్మాయిలు వచ్చాక వారి జీవితం ఎలా మారిపోయింది..? వారంతా ప్రేమలో పడి ఎందుకు విడిపోయారు. లవ్, బ్రేకప్ తర్వాత వారంతా ఎలా రియలైజ్ అయ్యారనేదే కథ.
కొత్తగా చూపించిన డైరెక్టర్..
ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ కాన్సెప్ట్‌తో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాను మాత్రం విక్రమ్ రెడ్డి తనదైన స్టైల్లో సిల్వర్ స్క్రీన్‌పై కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులను అయోమయంలో పడేయకుండా నాలుగు భిన్నమైన ప్రేమకథలను ఒకే ఫ్రేమ్‌లో చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
నేటి యువత పరిణతి లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో జరిగే నష్టాలు, ప్రేమలో ఎదురయ్యే సమస్యలు, పెళ్లి విషయంలో యువతీ యువకుల ఆలోచన ఎలా ఉంటుంది.. అనే అంశాలను ట్రెండ్‌కు తగినట్టు చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. లీడ్ యాక్టర్ల నుంచి తనకు కావాల్సిన పర్ఫార్మెన్ష్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే.,?
ఈ సినిమాలో నటించినవారు దాదాపు అందరూ కొత్తవాళ్లే. అయితే అలాంటి ఛాయలేమి కనిపించకుండా హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ప్రత్యేకించి విక్కీ రోల్ అందరికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. మరోవైపు ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించిన వారంతా తమ పాత్రల పరిధుల మేరకు నటించారు.
టెక్నికల్‌గా..
సన్నీ ఎంఆర్, హర్షవర్దన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ నేపథ్య సంగీతం బాగుంది. కథనంలో భాగంగా వచ్చే పాటలు , నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదనిపించేలా ఉంటుంది.
రేటింగ్ : 2.75/5
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Suriya 45 | సూర్య 45 పూజా సెర్మనీ టైం.. షూటింగ్ మొదలయ్యేది ఇక్కడే..!
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు