శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Realestate - Feb 06, 2021 , 00:43:15

గృహమే కదా స్వర్గసీమ!

గృహమే కదా స్వర్గసీమ!

  • అమీన్‌పూర్‌ లేక్‌ సమీపంలో ‘అర్బన్‌ రైజ్‌' సరికొత్త ప్రాజెక్ట్‌
  • హైదరాబాద్‌లో తొలిసారిగా 
  • ‘స్ప్రింగ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌' వెంచర్‌

వసంతకాల వాతావరణం ప్రత్యేకమైంది. అది ప్రకృతిలో సరికొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని పెంచుతుంది. అందుకే ఈకాలం ఎంతోమందికి ప్రియమైంది. ప్రకృతి ప్రేమికులు కోరుకునేలా.. ప్రతిరోజూ వసంతమే అనిపించేలా ‘అర్బన్‌ రైజ్‌' సంస్థ ఓ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. ‘మివాన్‌ టెక్నాలజీ’తో ‘స్ప్రింగ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌' ప్రాజెక్టును నిర్మిస్తున్నది. అమీన్‌పూర్‌ లేక్‌ను ఆనుకొని చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నది. 

దక్షిణ భారతదేశంలోనే రియల్‌ ఎస్టేట్‌రంగంలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ‘అర్బన్‌ రైజ్‌' సంస్థ హైదరాబాద్‌లో తొలి అడుగు వేసింది. అమీన్‌పూర్‌ వద్ద 28.65 ఎకరాల్లో ‘స్ప్రింగ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌' హౌసింగ్‌ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. నిరంతరం కొత్తదనం కోరుకునే వారికి ఏం కావాలో, అది అందించేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 

అద్భుత సరస్సు తీరంలో..

నగర శివారులో 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అమీన్‌పూర్‌ సరస్సుకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకృతి రమణీయత తొంగిచూసే ఈ ప్రాంతంలో 28.65 ఎకరాల్లో అత్యాధునిక శైలిలో హైరైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ‘న్యూ జనరేషన్‌ హోమ్స్‌ ఫర్‌ ది నెక్ట్స్‌ జనరేషన్‌ ఫ్యామిలీస్‌' అనే కాన్సెప్ట్‌తో అందమైన స్వర్గ సీమగా ‘స్ప్రింగ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌' హౌసింగ్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొదటిదశలో 5.66 ఎకరాల స్థలంలో 810 మన్‌హట్టన్‌ కాన్‌డోస్‌ ఇండ్లను మూడు టవర్స్‌లో నిర్మిస్తున్నారు. అత్యాధునిక క్లబ్‌ హౌస్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌, సూపర్‌మార్కెట్‌, సెలూన్‌ వంటివి లోపలే ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్‌ సిటీ డౌన్‌టౌన్‌లోని హైరైజ్‌ అపార్టుమెంట్లలో ఉండే ఆధునిక నిర్మాణ శైలిని స్ఫూర్తిగా తీసుకొని, భవిష్యత్‌ తరాలూ ఇష్టపడేలా ‘స్ప్రింగ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌'ను తీర్చిదిద్దుతున్నారు.

3.5 ఎకరాల్లో పార్కు 

అమీన్‌పూర్‌ లేక్‌ను అనుకునే 3. 5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో అద్భుతమైన పార్కును నిర్మిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. లేడీస్‌ కిట్టీ కార్నర్‌, సీనియర్‌ లేడీస్‌ కిట్టీ కార్నర్‌, సీనియర్‌ సిటిజన్స్‌ చిట్‌చాట్‌ కార్నర్‌, స్టార్టప్‌ కార్నర్‌, యంగ్‌టర్క్స్‌, యోగా లాన్‌, పెట్‌ లవర్స్‌ కోసం ప్రత్యేకంగా డాగ్‌ పార్కు, యాంపీ థియేటర్‌, మల్టీపర్పస్‌ లాన్‌, టెన్నిన్‌ కోర్టు, క్రికెట్‌.. ఇలా అనేక ప్రత్యేకతలతో పార్కును తీర్చిదిద్దుతున్నారు. ‘వర్క్‌ ఫ్రం పార్క్‌'కు అనుకూలంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కు నిర్మాణం చేపడుతున్నారు. ఉద్యోగులు పచ్చదనం మధ్యలో పనిచేసుకోవచ్చు.

చిన్నారులకు లెర్నింగ్‌ హబ్‌

చిన్నారులకోసం ప్రత్యేక లెర్నింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక ఫీచర్లతో ‘అర్బనైజ్‌ జీనియస్‌' పేరుతో చిల్డ్రన్స్‌ లెర్నింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలో భద్రతతోపాటు విశాలమైన 12వేల చదరపు అడుగుల్లో ‘చిల్డ్రన్‌ లెర్నింగ్‌ సెంటర్‌' కోసం ఆకట్టుకునే భవనాన్ని నిర్మిస్తున్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు ఇది అత్యుత్తమమైన పరిష్కారం చూపనున్నది. 0-5 సంవత్సరాలవారి కోసం డేకేర్‌ సెంటర్‌, ప్లే స్కూల్‌ అందుబాటులో ఉంటాయి. 6-12 సంవత్సరాల పిల్లల కోసం టెన్నిస్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌, ఇతర హాబీలపై శిక్షణ ఇచ్చేందుకు ట్రైనర్లు సిద్ధంగా ఉంటారు.  ట్యూషన్‌ టీచర్లూ ఉంటారు. 13-17 సంవత్సరాల వారికోసం ట్యూషన్‌, ఆర్ట్‌, మ్యూజిక్‌, యోగా, చెస్‌, రొబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్లాసులకూ ఏర్పాట్లు చేస్తున్నారు. 

అన్నిటికీ అనుకూలం 

ఈ ప్రాజెక్టులో ఇండ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ఎడ్యుకేషన్‌ విషయానికొస్తే వికాస్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌, శాంత గ్లోబల్‌ స్కూల్‌, ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూళ్లకు కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రవాణా విషయంలోనూ మియాపూర్‌ మెట్రో స్టేషన్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరాలంటే 15 నిమిషాలు చాలు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 45 నిమిషాల్లో చేరుకోవచ్చని అర్బన్‌ రైజ్‌ సంస్థ చైర్మన్‌ అండ్‌ ఎండీ మనోజ్‌ నంబూరు తెలిపారు. షాపింగ్‌ విషయానికి వస్తే శ్రీవన్‌ మాల్‌, జీఎస్‌ఎం మాల్‌, మంజీరా మాల్‌, ఫోరం సుజనా మాల్‌ ప్రాజెక్టుకు దగ్గరలోనే ఉన్నాయి. విజయా హాస్పిటల్‌, ఎస్‌ఎల్‌జీహెచ్‌ హాస్పిటల్‌, మల్లారెడ్డి హాస్పిటల్‌కు క్షణాల వ్యవధిలో చేరుకునే వీలు ఉందని పేర్కొన్నారు. దీనివల్ల నగరం నడిబొడ్డున ఉన్న భావన కలుగుతుంది. 

మైవాన్‌ టెక్నాలజీ..

ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ‘మైవాన్‌ టెక్నాలజీ’ని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా అల్యుమినియం షట్టరింగ్‌ బోర్డులతో స్లాబ్‌, గోడలను ఒకేసారి వేస్తారు. దీనివల్ల గోడలకు మంచి ఫినిషింగ్‌ వస్తుంది. ఈ టెక్నాలజీతో ఇండ్ల నిర్మాణాన్ని ఇప్పుడిప్పుడే  చేపడుతున్నారు. దీనివల్ల ఇంటి పైకప్పు స్లాబు ఉన్నంత దృఢంగా గోడలూ కూడా ఉంటాయి. దీన్నే ‘షేర్‌ టెక్నాలజీ’గానూ పిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాణాల వల్ల గోడలకు పగుళ్లు ఉండవు. సిమెంట్‌ కాంక్రీట్‌తోనే గోడలను నిర్మించడం వల్ల మందం తక్కువగా ఉన్నా, అవి బలంగా ఉంటాయి. గదులు కూడా ఎంతో విశాలంగా మారుతాయి. ఇలాంటి వాతావరణంలో జీవన ప్రమాణాలు  పెరుగుతాయి. బంధాలు మరింత బలపడతాయి. ఆ కుటుంబం ఆనందానికి చిరునామా అవుతుంది. నిజమే, గృహాన్ని మించిన స్వర్గం ఎక్కడుందీ!

VIDEOS

logo