తాండూరు రూరల్, ఫిబ్రవరి 3: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజాప్రతినిధులు సహకరించాలని తాండూరు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండలంలో సర్పంచ్, ఎంపీటీసీలతో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్‌వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగానే పసిగట్టి నిర్మూలిస్తే బాగుంటుందని తెలిపారు. అదేవిధంగా రైతులు పొలాల్లో గం జాయి సాగు చేస్తూ ఉంటారని, వారి విషయంపై కూడా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి సాగు చేస్తే గ్రామం మొత్తానికి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కర్ణాటక నుంచి గం జాయి గానీ, గుట్కా వంటి మత్తు పదార్థాలు దిగుమతి చేసుకునే వారి పై నిఘాపెట్టి, సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీటీసీ గౌడి మంజుల మాట్లాడుతూ యువత మత్తుకు అలవాటు పడకుండా తల్లిదండ్రులతోపాటు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కరణ్‌కోట ఎస్సై మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు అందరి కృషి అవసరమని ధారూర్ సీఐ తిరుపతిరాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆయా గ్రామాల సర్పంచులు, వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గంజాయి అమ్మకం, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని సీఐ తిరుపతిరాజు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ భవనంలోని సమావేశ మందిరంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులకు అవగాహన కార్య క్రమాన్ని ఏర్పా టు చేశారు. గంజాయి పెంపకం, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే తమ శాఖకు గాని, ఎక్సైజ్ శాఖాధికారులకు గాని, లేదా 100కు డయల్ చేసి చెప్పాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ ప్రభాకర్, ఎస్ఐ ఆనంద్‌కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ శంకర్ పాల్గొన్నారు.