Kammadanam | షాద్‌నగర్ రూరల్, జూన్ 21 : అంతార్జతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలంలోని కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యులత మాట్లాడుతూ.. యోగాతో విద్యార్థులలో ఏకగ్రత పెరుగుతందని దీంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అన్ని రుగ్మతలకు యోగా దివ్వ ఔషదంలా పనిచేస్తుందన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులు అనునిత్యం యోగా చేయాలన్నారు. యోగాతో మనుస్సుకు ప్రశాంతత లభిస్తుందని ప్రతి రోజు ఉత్సహంగా ఉండవచ్చాన్నారు. యోగాసనాలతో కలిగే ప్రయోజనాలను విద్యార్థినిలకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.